Renault Car Offers September 2026: రెనాల్ట్ ఇండియా సెప్టెంబర్ నెలలో తమ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా ఈ ఏడాది కొత్తగా మార్కెట్లోకి వచ్చిన డస్టర్‌పై భారీ బెనిఫిట్స్ అందిస్తోంది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.1.8 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. డస్టర్ తో పాటు కైగర్, ట్రైబర్, క్విడ్ మోడళ్లపై కూడా పలు రకాల డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.
న్యూ జెనరేషన్ రెనాల్ట్ డస్టర్‌పై సెప్టెంబర్‌లో ప్రకటించిన ఆఫర్లు ఆకట్టుకుంటున్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత కారును ఎక్స్ఛేంజ్ చేయడం, స్క్రాప్ చేయడం ద్వారా మరో రూ.50,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. రెనాల్ట్ కస్టమర్లకు లాయల్టీ బెనిఫిట్ కూడా ఉంది. ఇప్పటికే రెనాల్ట్ కారును ఉపయోగిస్తున్నవారు కొత్త డస్టర్‌కు అప్‌గ్రేడ్ అయితే రూ.10,000 వరకు బెనిఫిట్ లభిస్తుంది. పాత తరం డస్టర్ నుంచి కొత్త మోడల్‌కు మారేవారికి మాత్రం ఈ లాయల్టీ బెనిఫిట్ ఏకంగా రూ.1 లక్ష వరకు ఉంది. ప్రస్తుతం డస్టర్ ధర రూ.10.49 లక్షల నుంచి రూ.18.49 లక్షల మధ్య ఉంది.
రెనాల్ట్ కైగర్ కొనుగోలుదారులకు కూడా కంపెనీ అదరిపోయే ఆఫర్లు అందిస్తోంది. వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.85,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 వరకు లాయల్టీ బెనిఫిట్, మరో రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. దీనికి అదనంగా అర్హత ఉన్న కస్టమర్లకు రూ.5,000 వరకు కార్పొరేట్, రూరల్ ఆఫర్ కూడా లభిస్తుంది. కైగర్ ధరలు ప్రస్తుతం రూ.5.81 లక్షల నుంచి రూ.10.40 లక్షల వరకు ఉన్నాయి.
కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఉండే రెనాల్ట్ ట్రైబర్‌పై కూడా కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్‌లో గరిష్ఠంగా రూ.50,000 వరకు ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇందులో రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అలాగే కార్పొరేట్, రూరల్ కస్టమర్లకు మరో రూ.5,000 వరకు ఆఫర్ ఉంది. ట్రైబర్ ధర రూ.5.81 లక్షల నుంచి రూ.8.53 లక్షల మధ్య ఉంటుంది.
రెనాల్ట్ ఎంట్రీ లెవల్ మోడల్ క్విడ్‌పై కూడా సెప్టెంబర్ ఆఫర్లు కొనసాగుతున్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్, పాత వెహికల్ ను స్క్రాప్ చేయడం ద్వారా రూ.25,000 వరకు బెనిఫిట్ లభిస్తుంది. మొత్తంగా రూ.40,000 వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. క్విడ్ ప్రారంభ ధర రూ.4.53 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.5.61 లక్షల వరకు ఉంది.
Read Also: కొత్త బాలెనో ధరలు వచ్చేశాయ్.. హైదరాబాద్‌లో టాప్ వేరియంట్ రేట్ ఎంతంటే?