Viral News on Snakes: సాధారణంగా పాములు కాటేయడం చూస్తూ ఉంటాం. అలాగే కొండచిలువలు అయితే మేకలను, కుందేళ్లను మింగేయడం మన కంట పడుతూ ఉంటాయి. ఇక్కడ ఓ గిరినాగు పాము ఏకంగా మరో పామును మింగేసింది. జాత్యహంకారమో ఏమో కానీ, పామును వెంటాడి, వేటాడి తినేసింది. ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ హడలెత్తారు. ఈ ఘటన జరిగింది అనకాపల్లి జిల్లా మాడుగులలో..
మనం ఎక్కడికైనా వెళ్లే సమయంలో హఠాత్తుగా పాము కనిపించిందా ఇక అంతే సంగతులు. ఎక్కడ లేని భయం, ఆందోళన మనకు కలగాల్సిందే. అందుకు ప్రధాన కారణం పాము కాటేస్తే మన ప్రాణాల మీదికి వస్తుందన్నది మన భయానికి కారణం. అయితే పాముల్లో కూడా జాత్యహంకారం పెరిగిందేమో కానీ, అవి కాటేసే స్థాయి నుండి నేరుగా వెంటాడి, వేటాడే స్థాయికి చేరుకుంటున్నాయని ఈ ఘటన ఆధారంగా చెప్పవచ్చు.
పొలాలలో రైతుల కంట పాములు కనిపించడం సర్వసాధారణ విషయం. అలాగే అనకాపల్లి జిల్లా మాడుగులలోని ఓ రైతు పొలంలో భారీ గిరినాగు అక్కడి రైతులకు కనిపించింది. వారందరూ భయాందోళన చెంది, ఉరుకులు పరుగులు సాగించారు. కానీ ఆ గిరినాగు టార్గెట్ అక్కడి రైతన్నలు కాదు.. ఓ రక్తపింజర పాము. గిరినాగు వెంట పడుతుండడంతో రక్తపింజర పాము కూడా పరుగులు పెట్ట సాగింది. చివరకు భారీగా గల గిరినాగు పాము అనుకున్న పని చేసేసింది. ఏకంగా రక్తపింజరను నోటిలోకి తీసుకొని మింగేసింది. ఈ రెండు పాముల మధ్య సమరం మాత్రం.. సేమ్ టు సేమ్ మానవుల పోరాటాన్ని తలపించిందట.
Also Read: Pawan Kalyan: ఏం తమాషాగా ఉందా.. కసబ్ కూడా వచ్చేస్తాడు.. పవన్ కళ్యాణ్ సీరియస్
దీనితో భయాందోళన చెందిన రైతన్నలు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. వెంటనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని, పామే పామును మింగిన విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం చాకచక్యంగా ఆ గిరినాగు పామును పట్టుకొని బంధించారు. ఆ తర్వాత గిరినాగు పామును అడవిలో వదిలివేసినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు. ఈ గిరినాగులు మన్యం, ఉభయ గోదావరి జిల్లాల్లో తరచూ కనిపిస్తుంటాయని, ఇవి చాలా ప్రమాదకరమైనవిగా స్థానికులు తెలిపారు. మొత్తం మీద జాత్యహంకారం మానవుల నుండి చిన్న చిన్నగా జాత్యహంకారం జీవులకు కూడా పాకుతుందా అనే రీతిలో ఈ పాము జాతుల మధ్య సమరం సాగడం అక్కడి రైతన్నలకు నివ్వెరపోయేలా చేసిందట.