iPhone 17 Air Update: ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన నెక్ట్స్ జెనరేషన్ ఐఫోన్ లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 2025 నాటికి వీటి విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్త లైనప్ లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ తో పాటు ఐఫోన్ 17 ఎయిర్ ఉంటాయి. ఈ కొత్త వేరియంట్ అల్ట్రా-థిన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6 మి.మీ కంటే తక్కువ మందం కలిగి ఉంటుంది. ఈ మోడల్ స్లీక్ నెస్, పోర్టబిలిటీ విభాగంలో శామ్ సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ లాంటి ఫోన్లకు గట్టి పోటీని ఇవ్వనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 17 ఎయిర్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఐఫోన్ 17 ఎయిర్: కలర్ ఆప్షన్స్!
టిప్ స్టర్ మాజిన్ బుయు, ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్ నివేదిక ప్రకారం, ఐఫోన్ 17 ఎయిర్ నాలుగు వేర్వేరు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీటిలో క్లాసిక్ బ్లాక్, సిల్వర్, లైట్ గోల్డ్, లైట్ బ్లూ కరల్ లో ఉండనున్నాయి. గతంలోఆపిల్ బ్లూ రంగులకు భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. మ్యాక్ బుక్ ఎయిర్ M4 లో కనిపించే స్కై బ్లూను పోలి ఉండవచ్చు అంటున్నారు.
ఇక ఐఫోన్ 17 ఎయిర్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. సున్నితమైన స్క్రోలింగ్, మెరుగైన పనితీరును అందించనుంది. దీనిని అత్యంత సన్నగా, తేలికగా తయారు చేయడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీని బాడీ కేవలం 5.5 మి.మీ మందం, 145 గ్రాముల బరువు ఉంటుందని సమాచారం. ఇదే నిజం అయితే ఆపిల్ అత్యంత సన్నని స్మార్ట్ ఫోన్లలో ఒకటిగా మారుతుంది.
ఐఫోన్ 17 ఎయిర్ 8GB RAMతో అందుబాటులోకి రానుంది. A19 చిప్ ద్వారా శక్తిని పొందే అవకాశం ఉంది. బ్యాటరీ సామర్థ్యం 2800mAhగా ఉంటుందని భావిస్తన్నారు. కెమెరాల పరంగా, గాడ్జెట్ వెనుక సెన్సార్ ను కలిగి ఉండవచ్చు. అంతేకాదు, ఆపిల్ ఫ్యూజన్ కెమెరా టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ 2x ఆప్టికల్ క్వాలిటీ జూమ్ ను కలిగి ఉంటుంది. లైట్ ఫ్రేమ్ ఉన్నప్పటికీ ఫోటో సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
Read Also: బడ్జెట్ రేట్ లో సూపర్ స్మార్ట్ ఫోన్, Realme C71 5G ట్రై చేయండి!
ఐఫోన్ 17 ఎయిర్ ధర ఎంత అంటే?
ఐఫోన్ 17 ఎయిర్ ధరపైకా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం మన దేశంలో దాదాపు రూ. 89,900గా ఉంటుందని తెలుస్తోంది. అమెరికాలో దీని ధర $899 కాగా, దుబాయ్ లో AED 3,799 ఉంటుందని అంచనా. సెప్టెంబర్ ఈవెంట్ సందర్భంగా Apple iPhone 17 సిరీస్ తో పాటు ఫోన్ ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇండియా, అమెరికా, దుబాయ్ లో నివసించే Apple లవర్స్ అధికారిక లాంచ్ తర్వాత పొందే అవకాశం ఉంటుంది.
Read Also: బడ్జెట్ రేట్ లో సూపర్ స్మార్ట్ ఫోన్, Realme C71 5G ట్రై చేయండి!