BigTV English

Viral love story: పోలీస్ స్టేషన్‌లో ప్రేమికుల పెళ్లి.. రీల్ కాదు ఇది రియల్!

Viral love story: పోలీస్ స్టేషన్‌లో ప్రేమికుల పెళ్లి.. రీల్ కాదు ఇది రియల్!

Viral love story: ప్రేమకు అడ్డుగోడలు ఎక్కడ నుంచైనా రావచ్చు. ఇంటి నుంచి వచ్చే ఆ అడ్డంకులను దాటి వెళ్లాలంటే కొంత ధైర్యం అవసరం. అలాంటి ప్రేమ జంట బైక్ పై తమ జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. కానీ ఊహించని మలుపు ఎక్కడ వచ్చిందో తెలుసా? పోలీస్ చెక్‌పోస్టు దగ్గరే!


చిత్తూరు జిల్లా కె.వి.పల్లి మండలంలోని మహల్‌రాజుపల్లెకు చెందిన వంశీ (24), నందిని (19) మధ్య గత కొంతకాలంగా ప్రేమ కొనసాగుతోంది. ఇద్దరూ ఒకే ఊరి వారు, ఒకే ఊరిలో కలిసిమెలిసి పెరిగారు. కాలక్రమేణా వారి స్నేహం ప్రేమగా మారింది. కానీ వారి కుటుంబాలు మాత్రం ఈ ప్రేమకు మద్దతు ఇవ్వలేదు. పెద్దలు ఒప్పుకోకపోతే ఇక చేసేదేముంది.. ఇద్దరూ ప్లాన్ వేశారు. కొత్త లైఫ్ సాగించేందుకు బైక్ పై పారిపోయే ప్రయత్నాన్ని ఆరంభించారు.

ఒకే బైక్‌పై కొత్త జీవితాన్ని చేజిక్కించుకోవాలని ఉత్సాహంగా ప్రయాణం మొదలు పెట్టిన జంట రొంపిచర్ల పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా చిక్కారు. ఈ ప్రేమ జంటను పోలీసులు ప్రశ్నించగా, నిజం చెప్పేశారు. మేము ప్రేమించుకున్నాం సార్.. ఇంట్లో ఒప్పుకోవడం లేదు.. పెళ్లి చేసుకొని జీవితాన్ని సాగించాలనుకుంటున్నామని స్పష్టంగా చెప్పారు.


ఈ విషయాన్ని అర్థం చేసుకున్న పోలీసులు ముందు ఆశ్చర్యపోయారు. కానీ వారిలోని మానవత్వం అప్పుడే మేలుకుంది. అలాంటి ప్రేమను అడ్డగించటం కన్నా, వారిని రక్షించడం మంచిదని భావించారు. వెంటనే స్థానిక పెద్దలను పిలిపించారు. ఇద్దరి మధ్య చర్చలు జరిపి, వారి అంగీకారంతో పోలీస్ స్టేషన్‌నే పెళ్లి మండపంగా మార్చారు. పెళ్లి మంత్రాల శబ్దం.. పోలీస్ స్టేషన్‌లో హర్షధ్వానాలు.. జంట పెళ్లి చేసుకుంటుండగా పోలీసులు కూడా సాక్ష్యులయ్యారు. స్టేషన్‌లోనే పచ్చబొట్లు పెట్టి, మంగళసూత్రం కట్టించి వారి పెళ్లిని అధికారికంగా అంగీకరించారు. అనంతరం పోలీసులే స్వయంగా వాళ్లకు రక్షణగా నిలబడి, సురక్షితంగా విడిదికి పంపారు.

Also Read: Viral Ferrari video: రూ.4 కోట్ల ఫెరారీ కారును ఇంట్లో వేలాడదీశాడు.. చూస్తే మీరే షాకవుతారు!

ఈ ఘటనకు చుట్టుపక్కల ప్రజలు చప్పట్లు కొడుతూ మద్దతు తెలిపారు. చాలామందికి ఇది ఆశ్చర్యంగా అనిపించినా, ప్రేమను అర్థం చేసుకొని నిలిచిన పోలీసుల వ్యవహారం మెచ్చుకోదగినదేనని కొందరు తమ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.

సాధారణంగా యువత ప్రేమించి పారిపోతే.. పోలీస్ స్టేషన్లకు వచ్చారంటే చాలు.. తిట్లు, ఫోన్ కాల్స్, పెద్దల ఒత్తిడి అన్నీ ఊహించదగ్గవే. కానీ రొంపిచర్ల పోలీసుల తీరు మాత్రం భిన్నంగా ఉండటమే కాక, ఒక ప్రేమ కథకు అద్భుత ముగింపు కూడా ఇచ్చింది. వారిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకునే అధికారులే నిజమైన రక్షకులు అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు అరుదుగా మన కళ్ల ముందు కనిపిస్తాయి. ప్రేమను కాస్త అవమానంగా చూసే మన సమాజంలో.. పోలీసులు ప్రేమికుల పక్షాన నిలబడి, పెళ్లి జరిపిస్తే.. అది మారుతున్న ఆలోచనల సంకేతమే కదా అనేస్తున్నారు మరికొందరు. ఒకవేళ ఈ జంట మరోచోట పట్టుబడినా, దుర్మార్గపు సంఘటనలు జరిగేవే కావచ్చు. కానీ రొంపిచర్ల పోలీసుల సానుకూల వైఖరి వల్ల ప్రేమకు ప్రాణం దక్కింది. ఈ కథ ఒక రొమాంటిక్ సినిమా క్లైమాక్స్ లా మారిందని చెప్పవచ్చు.

Related News

Bird wedding festival: ఇక్కడ యువకులకు పెళ్లి నిల్.. పక్షులకు మాత్రం గ్యారెంటీ.. ఈ వెరైటీ కల్చర్ ఎందుకంటే?

Viral Video: ట్రాఫిక్ పెరిగిందని.. బాహుబలిలా బైకును భుజంపై పెట్టుకుని నడిచిన వాహనదారుడు, వీడియో వైరల్

Watch Video: రైల్లో కూలర్ ఏసుకుని పడుకుంటే, ఆహా ఐడియా అదిరింది భయ్యా!

Ganesh Chaturthi festival: చేతికి వంద.. ప్లేట్ నిండా భోజనం.. అన్నదానం ఇలా కూడా చేస్తారా బ్రో?

Viral News: స్కూల్‌ పై దావా వేసిన దొంగ.. నెలకు లక్షన్నర జీతం చెల్లిస్తున్న యాజమాన్యం!

Viral video: కబడ్డీ ఆడుతుండగా భారీ శబ్దంతో పిడుగు.. యువకులు పరుగో పరుగు.. వీడియో ఫుల్ వైరల్

Big Stories

×