చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్ మీ భారతీయ మార్కెట్ లోకి C71 5G స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ కొనుగోలుదారులను టార్గెట్ చేసుకుని 5G స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. 6,300mAh బ్యాటరీ, UNISOC T7250 చిప్‌సెట్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీని ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. బ్యాటరీ ఒకే ఛార్జ్ పై రెండు రోజుల వరకు పని చేస్తుందని రియల్ మీ వెల్లడించింది.
Realme C71 5G ధర, వేరియంట్లు
Realme C71 5G రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ ధర రూ. 7,699గా కంపెనీ నిర్ణయించింది. అటు 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,699గా ఫిక్స్ చేసింది.
Realme C71 5G రంగులు
Realme C71 5G స్మార్ట్ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. సీ బ్లూ, అబ్సిడియన్ బ్లాక్ లో లభ్యం అవుతుంది.
Realme C71 5G లాంచ్ ఆఫర్లు
Realme C71 5G రియల్ మీ అధికారిక వెబ్ సైట్ తో పాటు Flipkart సహా చేసిన ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ప్రారంభం ఆఫర్ లో భాగంగా, 6GB RAM వేరియంట్ ను కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 700 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది.
Realme C71 5G ఫీచర్లు
Realme C71 5G UNISOC T7250 ప్రాసెసర్ ద్వారా పవర్ ను పొందుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్, 568 nits పీక్ బ్రైట్ నెస్, 6.74-అంగుళాల LCD డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 7.94mm మందం, 201g బరువును కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 13MP ప్రైమరీ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే AI ఎరేజర్, AI క్లియర్ ఫేస్ ప్రో మోడ్, డ్యూయల్-వ్యూ వీడియో ఆప్షన్ ను కలిగి ఉంటుంది. C71 5G వెనుక భాగంలో పల్స్ లైట్ డిజైన్‌ను కలిగి ఉంది.
ఒక్క ఛార్జ్ తో 2 రోజులు వర్కింగ్
ఈ స్మార్ట్ ఫోన్ 6,300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 15W వైర్డ్ ఛార్జింగ్, 6W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఒక్క ఛార్జ్ తో ఈ స్మార్ట్ ఫోన్ 46.5 గంటల కాల్ టైమ్, 19 గంటల Instagram వినియోగం, 20.7 గంటల YouTube స్ట్రీమింగ్ ను పొందే అవకాశం ఉంటుంది.
Realme C71 5G స్పెసిఫికేషన్లు
రియల్ మీ మిలిటరీ గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ ను కలిగి ఉంటుంది. 6.74-అంగుళాల LCD డిస్ ప్లేను కలిగి ఉంటుంది. 90Hz, 568 nits పీక్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. UNISOC T7250 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. Android 15 ఆధారంగా Realme UI పని చేస్తుంది.
Read Also: భారత్ లోకి టెస్లా ఎంట్రీ, ఫస్ట్ షో రూమ్ ఓపెనింగ్ ఎక్కడంటే?