iPhone Vs Android app Subscription Prices : యాపిల్ ఐఫోన్ లేదా అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో పలు పాపులర్ యాప్స్, ప్రీమియమ్ ఫీచర్లు లేదా సర్వీసెస్ ను వినియోగించుకోవాలంటే సబ్స్క్రిప్షన్ చెల్లించాలన్న సంగతి తెలిసిందే. నెలవారి లేదా వార్షిక రుసుములను చెల్లించాలి. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా ఐఫోన్లలో వీటిని ఉపయోగించుకోవాలంటే, వాటి సబ్స్క్రిప్షన్ ధరలు ఎక్కువగా ఉంటాయని అంటుంటారు. మరి నిజంగానే యాపిల్ ఐఫోన్లో యాప్స్, ప్రీమియర్ ఫీచర్స్, సర్వీసెస్ సబ్స్క్రిప్షన్ ధరలు ఎక్కువగా ఉన్నాయా, ఆండ్రాయితో పోలీస్తే ధరల్లో ఎంత వ్యత్యాసం ఉన్నాయో? ఓ సారి పరిశీలిద్దాం.
అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ప్రీమియమ్, గూగుల్ వన్ లాంటి గూగుల్ సబ్స్క్రిప్షన్స్ ధరలు కొనగలిగే రేంజ్‌లోనే ఉంటాయి. అంటే సరసమైన ధరలకే లభిస్తాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సహా అలాగే ఈ సర్వీసెస్‌లను గూగుల్ డెవలప్ చేయడం వల్ల వీటికి ఎటువంటి ప్లాట్‌ఫామ్ ఛార్జీలు ఉండవు! పైగా ఆండ్రాయిడ్ డివైస్‌లపై ఈ సర్వీసెస్ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు కూడా 20 శాతం వరకు తక్కువగా ఉంటాయి.
ఉదాహరణకు, ఐఫోన్స్‌లో యూట్యూబ్ ప్రీమియమ్ నెల వారి సబ్స్క్రిప్షన్ రూ.195. అదే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌లో రూ.149కే కొనుగోలు చేయొచ్చు. మెటా విషయానికొస్తే దీని సబ్స్క్రిప్షన్ అటు ఆండ్రాయిడ్‌లో ఇటు ఐఓఎస్‌లో రూ. 639గా ఉంది. కానీ ఆండ్రాయిడ్ యూజర్స్ ఈ మెటా సబ్స్క్రిప్షన్ ను డిస్కౌంట్ ఆఫర్ కింద మొదటి నెలలో రూ. 579కే పొందొచ్చు.
ఆండ్రాయిడ్ తో పోలీస్తే ఐఫోన్ లో ఇతర యాప్స్ సబ్స్క్రిప్షన్ రుసుముల ధరల్లోనూ వ్యత్యాసం ఉంది. ఐఫోన్లో ఒక నెలకు గానూ ఎక్స్ (గతంలో ట్విటర్) ప్రీమియమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ రూ. 2,299గా ఉండగా, ఆండ్రాయిడ్‌లో అది రూ. 2,150గానే ఉంది.
అయితే కొన్ని సర్వీసెస్‌కు మాత్రం రెండు ప్లాట్‌ఫామ్‌లలోనూ (ఐఫోన్, యాండ్రాయిడ్) దాదాపుగా ఓకే ధరలు ఉన్నాయి. ట్రూ కాలర్ నెలవారి సబ్స్క్రిప్షన్ రూ. 99, ఏడాది రుసుము రూ. 899గా ఉంది. అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ రెండింటిలోనూ ట్రూకాలర్ ధర ఇదే.
ఇంకా యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ప్లస్ లాంటి యాపిల్ సర్వీసెస్ కూడా దాదాపుగా ఓకే ప్రైజ్ ఉన్నాయి. ఇక లింక్డ్ఇన్ ప్రీమియమ్ విషయానిస్తే ధరలు కాస్త వ్యత్యాసంతోనే ఉన్నాయి. ఆండ్రాయిడ్‌లో రూ. 925 ఉండగా, ఐఫోన్స్‌లో రూ. 919గా ఉన్నాయి.
సింపుల్‌గా చెప్పాలంటే ఆండ్రాయిడ్‌లోని గూగుల్ సర్వీసెస్ సబ్స్క్రిప్షన్ ధరలు సరసరమైనవిగా ఉన్నాయి. గూగుల్ సర్వీసెస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ డివైజ్ ఎక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. అయితే ఈ ధరల వ్యత్యాసాలు యాప్‌ను బట్టి మారుతూ ఉంటాయి. మొత్తంగా చూస్తే యాప్ సబ్ ధరలు డివైస్ (ఐఫోన్, ఆండ్రాయిడ్) ఆధారంగా కాకుండా దాని ఇండివిడ్యుయెల్ సర్వీస్ పాలిసీస్పైనే ఆధారపడి ఉంటాయి. అదే పైన చెప్పుకున్న యాప్స్, సర్వీసెస్ అన్నీ ఆండ్రాయిడ్, ఐఫోన్ కాకుండా డెస్క్‌టాప్ / వెబ్ నుంచి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మరింత తక్కువ ధరకే లభిస్తాయి.
ALSO READ : బెస్ట్ కెమెరా, బ్యాటరీ ఉన్న టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ – రూ.30వేలలోపు!