iQOO 16: ఐకూ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న iQOO 16 స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. కంపెనీ ఈ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఈ నెల చివర్లో చైనాలో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. లాంచ్‌కు ముందే ఐకూ 16కు సంబంధించిన పలు ఆసక్తికరమైన వివరాలను కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ఫోన్‌తో పాటు iQOO Pad Ultra ట్యాబ్లెట్ కూడా మార్కెట్లోకి రానుంది. ప్రీమియం లుక్‌తో ఆకట్టుకునే డిజైన్, గేమింగ్ ప్రియులను టార్గెట్ చేసే శక్తివంతమైన ఫీచర్లతో ఐకూ 16పై అంచనాలు భారీగా ఉన్నాయి.
iQOO 16 డిజైన్ విషయానికి వస్తే.. ముందు మోడల్ లాగే ఇది కూడా ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో వస్తోంది. అయితే కెమెరా మాడ్యూల్‌ను మాత్రం కంపెనీ పూర్తిగా మార్చేసింది. చతురస్రాకారంలో ఉండే ఈ కెమెరా ఐలాండ్ లోపల మూడు లెన్సెస్ ఉంటాయి. రోబోటిక్ ఆర్మ్ డిజైన్‌తో ఈ లెన్సెస్ కనెక్ట్ అయి ఉంటాయి. చూడటానికి ఇది ఒక నేవిగేటర్ సింబల్ మాదిరి కనిపిస్తుంది. గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌పై కనిపించే హెక్సాగోనల్ టెక్ పాటర్న్ ఫోన్‌కు మరింత రిచ్ లుక్‌ను ఇస్తుంది. ముఖ్యంగా లైట్ చేజింగ్ కలర్ ఆప్షన్ యూజర్లను ఇప్పట్నుంచే బాగా అట్రాక్ట్ చేస్తోంది.
Also Read: ఒప్పో ఫైండ్ N6 vs మోటరోలా రేజర్ ఫోల్డ్.. ఈ రెండింటిలో ఫీచర్లు, కెమెరా, డిజైన్ పరంగా ఏది బెటర్?
ఈసారి కెమెరా విషయంలో ఐకూ కంపెనీ భారీ అప్‌డేట్ ఇస్తున్నట్లు స్పష్టమైంది. కెమెరా మాడ్యూల్ మీద క్లియర్‌గా 100x టెలీ లెన్స్ అని రాసి ఉంది. అంటే ఈ ఫోన్ ద్వారా ఏకంగా వంద రెట్లు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతోంది. ప్రైమరీ కెమెరాతో పాటు అల్ట్రావైడ్, పెరిస్కోప్ టెలీఫోటో లెన్సెస్ దీంట్లో ఉన్నాయి. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ కెమెరా మోడ్యూల్ బయట అమర్చబడి ఉంది.
కేవలం లుక్స్‌కే పరిమితం కాకుండా పనితీరు లోనూ ఈ ఫోన్ అదరగొట్టనుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ సిరీస్ చిప్‌సెట్‌తో ఇది మార్కెట్లోకి వస్తోంది. దీనికి తోడు ప్రత్యేకమైన కొత్త గేమింగ్ చిప్, మాన్సర్ సూపర్ ఇంజిన్ ఇందులో ఉండబోతున్నాయి. మొబైల్ గేమింగ్ ఆడేటప్పుడు ఎలాంటి లాగ్స్ లేకుండా, సిస్టమ్ వేడెక్కకుండా ఇది చూసుకుంటుంది. అంతేకాదు.. పీసీ గేమింగ్‌లో మాదిరిగా అద్భుతమైన రే ట్రేసింగ్ ఎఫెక్ట్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.
ఫోన్ బాడీ విషయానికి వస్తే చుట్టూ ఫ్లాట్ మెటల్ మిడ్ ఫ్రేమ్ ఇచ్చారు. ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. వీటితో పాటు నెట్‌వర్క్ సిగ్నల్స్ కోసం పలు యాంటెన్నా బ్యాండ్స్ కనిపిస్తాయి. చూడటానికి స్లీక్‌గా, చేతిలో పట్టుకోవడానికి ఎంతో కంఫర్టబుల్‌గా ఈ ఫోన్ డిజైన్ చేశారు. మొత్తానికి ఈ ఏడాది ఎండ్‌లో మార్కెట్లోకి రాబోతున్న బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇదేనని చెప్పవచ్చు.
Also Read: పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!