Oppo Find N6 vs Motorola Razr Fold: ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. పెద్ద స్క్రీన్‌తో టాబ్లెట్ లాంటి అనుభూతిని అందించడంతో పాటు, మడిచినప్పుడు చేతిలో సౌకర్యంగా ఉండే ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇప్పుడు ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో Oppo Find N6, Motorola Razr Fold వంటి ఫోన్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. డిజైన్, డిస్‌ప్లే, పనితీరు, కెమెరాలు, బ్యాటరీ విషయంలో ఈ రెండు ఫోన్లు తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. మరి వీటిలో ఏ ఫోన్ మెరుగ్గా ఉంది? రెండింటి మధ్య ఉన్న కీలకమైన తేడాలేమిటో ఇప్పుడు చూద్దామా.
ఒప్పో ఫైండ్ N6లో 8.12 అంగుళాల పెద్ద మెయిన్ డిస్‌ప్లేతో పాటు 6.62 అంగుళాల కవర్ స్క్రీన్ ఉంటుంది. మోటరోలా రేజర్ ఫోల్డ్‌లో 8.1 అంగుళాల మెయిన్ స్క్రీన్, 6.6 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. పరిమాణంలో రెండు ఫోన్ల మధ్య పెద్దగా తేడా లేకపోయినా.. కవర్ స్క్రీన్ విషయంలో మోటరోలా ముందుంది. రేజర్ ఫోల్డ్‌లో 165Hz రిఫ్రెష్ రేట్ ఉండగా.. ఫైండ్ N6లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అయితే ఫోన్ బరువు విషయానికి వస్తే.. ఒప్పో ఫైండ్ N6 బరువు 225 గ్రాములు కాగా.. రేజర్ ఫోల్డ్ 243 గ్రాములుగా ఉంది. అంటే.. మోటరోలాతో పోలిస్తే ఒప్పో ఫోన్ చేతిలో కాస్త తేలికగా అనిపిస్తుంది.
Also Read: 7,500mAh బ్యాటరీ.. డైమెన్సిటీ 9600M చిప్‌తో అదరగొట్టనున్న Vivo X500 ఫోన్!
ఇక పనితీరు విషయానికి వస్తే.. ఒప్పో ఫైండ్ N6లో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌ను అందించారు. Android 16 ఆధారిత ColorOS 16తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఒకేసారి నాలుగు యాప్స్‌ను ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. దీంతో మల్టీటాస్కింగ్ చేసే వారికి ఫైండ్ N6 ఉపయోగకరంగా ఉంటుంది. మోటరోలా రేజర్ ఫోల్డ్‌లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్, Android 16 ఆధారిత My UX ఉన్నాయి. అయితే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విషయంలో మోటరోలాకు మంచి ప్లస్ పాయింట్ ఉంది. ఈ ఫోన్‌కు ఏడేళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ చెబుతోంది.
Oppo Find N6లో 200MP ప్రధాన కెమెరాతో పాటు 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అంతేకాదు.. 4K 120fps Dolby Vision వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ ఉంది. Motorola Razr Foldలో మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. రోజువారీ ఫొటోలు, వీడియోలకు ఇవి సరిపోతాయి. అయితే కెమెరా స్పెసిఫికేషన్స్, వీడియో ఫీచర్లను చూస్తే Find N6కు కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొచ్చు.
రెండు ఫోన్లలోనూ తమదైన ప్రత్యేకతలు ఉన్నాయి. మంచి పనితీరు, మెరుగైన కెమెరాలు, తక్కువ బరువు, సన్నని డిజైన్‌కు ప్రాధాన్యత ఇస్తే Oppo Find N6 మంచి ఎంపికగా చెప్పొచ్చు. మరోవైపు 165Hz కవర్ స్క్రీన్, ఎక్కువ కాలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కావాలనుకునే వారికి Motorola Razr Fold నచ్చొచ్చు. అందుకే మీకు కెమెరా, పనితీరు ముఖ్యమా? లేక డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ముఖ్యమా? అనే దానిని బట్టి ఈ రెండు ఫోన్లలో ఒకదాన్ని ఎంచుకోవడం మంచిది.
Also Read: ఆన్‌లైన్ మోసాల బారిన పడి డబ్బులు పోయాయా? ఇలా చేస్తే రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది!