E-Paper
Advertisement

రూ.2వేల బడ్జెట్‌లో ఇంత సౌండ్ మ్యాజికా ? కొత్త ఐక్యూ బడ్స్ చూస్తే అవాక్కవుతారు!

రూ.2వేల బడ్జెట్‌లో ఇంత సౌండ్ మ్యాజికా ? కొత్త ఐక్యూ బడ్స్ చూస్తే అవాక్కవుతారు!
Advertisement

iQOO Buds Review: మార్కెట్లో ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌ బడ్స్‌కు విపరీతమైన క్రేజ్ నడుస్తోంది. ఇదే క్రమంలో ఐక్యూ సంస్థ తన సరి కొత్త ‘iQOO Buds’ తో ఎంట్రీ ఇచ్చింది. ఇవి చూడటానికి.. ఇది సాధారణ బడ్జెట్ ఇయర్‌ బడ్స్ లా అనిపించినా.. వీటిని వాడినప్పుడు మాత్రం అదిరిపోయే.. సౌండ్ క్వాలిటీతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ బడ్జెట్ TWS అసలు ఎలా పని చేస్తుంది? దీనిలో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్లు ఏంటి అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, లుక్ :

ఐక్యూ బడ్స్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ముఖ్యంగా.. ఎల్లో కలర్ ఆప్షన్ యూత్‌ కి బాగా నచ్చుతుంది. ఇయర్‌ బడ్స్ చాలా తక్కువ బరువు ఉండటం వల్ల, గంటల తరబడి చెవుల్లో.. పెట్టుకున్నా ఎలాంటి నొప్పి తెలియదు. ఆఫీస్ వర్క్ చేసుకునే వారికీ, జిమ్ చేసే వారికీ.. ఇవి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. IP54 వాటర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల చెమట పట్టినా, చిన్న పాటి వర్షంలో తడిచినా భయపడాల్సిన పని లేదు.

సౌండ్ క్వాలిటీ:

Advertisement

ఈ బడ్జెట్ ఇయర్‌ బడ్స్‌లో.. 10ఎంఎం డ్రైవర్లను వాడారు. సాధారణంగా.. ఈ ధరలో వచ్చే ఇయర్‌ బడ్స్ బేస్ సరిగ్గా ఉండదు, కానీ ఐక్యూ బడ్స్ విషయంలో.. అలా లేదు. డీప్‌ఎక్స్ 4.0 సౌండ్ టెక్నాలజీ.. వల్ల మ్యూజిక్ చాలా క్లియర్ గా, బాస్ ఎఫెక్ట్స్ పవర్‌ ఫుల్‌గా వినిపిస్తాయి. మీరు రాక్ మ్యూజిక్ లేదా.. హిప్-హాప్ ఇష్టపడే వారైతే, ఈ బడ్జెట్ రేంజ్‌లో ఇది బెస్ట్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు.

గేమింగ్, కనెక్టివిటీ:

చాలా మందికి మొబైల్ గేమింగ్ అంటే ఇష్టం. అలాంటి వారి కోసం ఇందులో 42ms అల్ట్రా లో-లేటెన్సీ మోడ్ ఇచ్చారు. దీని వల్ల మీరు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆడియో, వీడియో మధ్య గ్యాప్ ఉండదు. బ్లూటూత్.. కనెక్టివిటీ కూడా చాలా వేగంగా ఉంటుంది. డ్యూయల్-డివైస్ మల్టీపాయింట్ కనెక్టివిటీ ఉండటం.. వల్ల, మీరు ల్యాప్ టాప్‌లో సినిమా చూస్తూనే.. ఫోన్ కి కాల్ వస్తే వెంటనే స్విచ్ అవ్వొచ్చు. ఇది ఈ బడ్జెట్ లో గొప్ప ఫీచర్.

Advertisement

Also Read: తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్..అమెజాన్ ఆఫర్‌లో మినీ ఫ్రిడ్జ్‌‌లు

బ్యాటరీ లైఫ్ :

ఈ ఇయర్‌ బడ్స్‌కి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ వీటి బ్యాటరీ లైఫ్. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. 12 గంటల వరకు మ్యూజిక్ ప్లే అవుతుంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపితే.. మొత్తం 50 గంటల వరకు బ్యాకప్ వస్తుంది. అంటే.. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే, వారం రోజుల పాటు మీరు మళ్లీ ఛార్జర్ కోసం వెతకాల్సిన పని లేదు. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ తో.. 4 గంటల ప్లేటైమ్ రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం.

రూ.2 వేల లోపు ధరలో దొరికే.. ఇయర్‌ బడ్స్ లో చాలా మందికి ఆడియో క్వాలిటీ పెద్ద సమస్యగా ఉంటుంది. కానీ.. ఐక్యూ బడ్స్ ఆ సమస్యను తీర్చే.. ప్రయత్నం చేశాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేకపోయినా.. మంచి బ్యాటరీ, అద్భుతమైన సౌండ్ , గేమింగ్ ఫీచర్లు కావాలనుకునే.. వారికి ఇవి ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. మీరు తక్కువ ధరలో.. మంచి బ్రాండెడ్ ఇయర్‌ బడ్స్ కోసం చూస్తుంటే.. దీన్ని కచ్చితంగా ట్రై చేయొచ్చు.

Related News

రూ.30వేలలోపే ల్యాప్‌టాప్..హెచ్‌పి 14q స్పెసిఫికేషన్స్ ఇవే!

యూఏఈ సంచలనం.. ఎడారి ఇసుకతో ఇటుకలు.. 50% తగ్గనున్న కన్‌స్ట్రక్షన్ కాస్ట్!

కేవలం చూడటానికే కాదు.. మీ స్మార్ట్ టీవీతో ఈ అద్భుతమైన పనులు కూడా చేయొచ్చు!

డార్క్ మోడ్ Vs లైట్ మోడ్.. మీ ఫోన్ బ్యాటరీని కాపాడే అసలైన హీరో ఎవరు?

అమ్మబాబోయ్.. రూ.200 లోపు ఇన్ని మంచి ప్లాన్స్ ఆ.. BSNL‌కు సెల్యూట్ చేయాల్సిందే!

రూ.5799కే 24 ఇంచుల టీవీ..చిన్న రూమ్స్, షాపులకు ఇది పర్ఫెక్ట్!

పాత ఫ్యాన్లను మార్చేయండి..కరెంట్ ఆదా చేసే సూపర్ మోడల్ వచ్చేసింది

Big Stories

Advertisement
×