E-Paper
Advertisement

యూఏఈ సంచలనం.. ఎడారి ఇసుకతో ఇటుకలు.. 50% తగ్గనున్న కన్‌స్ట్రక్షన్ కాస్ట్!

యూఏఈ సంచలనం.. ఎడారి ఇసుకతో ఇటుకలు.. 50% తగ్గనున్న కన్‌స్ట్రక్షన్ కాస్ట్!
Advertisement

Desert Sand Bricks: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) నిర్మాణ రంగంలో ఒక కొత్త విప్లవానికి తెరతీసింది. ఎడారిలో విస్తారంగా దొరికే ఇసుకను వినియోగించుకుంటూ పర్యావరణహిత ఇటుకలను తయారు చేసే ప్రత్యేక సాంకేతికతను అక్కడి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ వినూత్న విధానం వల్ల భవన నిర్మాణాల్లో వాడే సిమెంట్ వినియోగాన్ని దాదాపు సగానికి తగ్గించవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ప్రత్యేక పదార్థాలతో కలిపి..

సాధారణంగా ఎడారి ఇసుక రేణువుల పరిమాణం, ఆకారం వల్ల దానిని భవన నిర్మాణాలకు నేరుగా ఉపయోగించడం చాలా కష్టం. అయితే యుఏఈ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ కొత్త పద్ధతిలో ఎడారి ఇసుకను ప్రత్యేక పదార్థాలతో కలిపి గట్టి ఇటుకలుగా మారుస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల సాంప్రదాయ ఇటుకల కంటే అత్యంత బలంగా ఉండే ఇటుకలు రూపుదిద్దుకుంటున్నాయి. అత్యంత వేడిని, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం ఈ ఇటుకలకు ఉండటం విశేషం.

సిమెంట్ వాడకానికి చెక్

Advertisement

సిమెంట్ తయారీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున కార్బన ఉద్గారాలు వెలువడుతుంటాయి. ఇది పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోంది. యుఏఈ తీసుకొచ్చిన ఈ కొత్త ఇటుకల తయారీ విధానం వల్ల నిర్మాణంలో అవసరమయ్యే సిమెంట్ పరిమాణం దాదాపు 50 శాతం వరకు తగ్గనుంది. దీని ద్వారా కర్బన ఉద్గారాలను విశేషంగా తగ్గించవచ్చని ఇది వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని పర్యావరణ వేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: వరల్డ్‌ ఫేమస్ వ్యక్తులు.. చనిపోయినా వదల్లేదు.. సమాధులు తవ్వి శరీర భాగాలు ఎత్తుకెళ్లారు!

నిర్మాణ రంగానికి భారీ ఆదా

Advertisement

మరోవైపు ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే.. నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎడారి ప్రాంతాల్లో ఇసుక ఉచితంగా, భారీగా లభ్యమవుతుంది కాబట్టి ముడిసరుకు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. అలాగే సిమెంట్ వినియోగం తగ్గడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం సగానికి పైగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పర్యావరణహిత ఇటుకలను వాణిజ్యపరంగా విస్తృతంగా ఉత్పత్తి చేసి భవిష్యత్ నిర్మాణాల కోసం ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: పరువు కోసం మేనకోడల్ని చంపిన మామ.. ఆత్మ వెంటాడకుండా ఉండేందుకు మేకులు, ఉప్పుతో కలిపి

Tags

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×