E-Paper
Advertisement

7050mAh బ్యాటరీతో రచ్చలేపుతున్న iQOO Z11.. లాంచ్ ఆఫర్‌తో ఎంత తక్కువకు వస్తుందంటే?

7050mAh బ్యాటరీతో రచ్చలేపుతున్న iQOO Z11.. లాంచ్ ఆఫర్‌తో ఎంత తక్కువకు వస్తుందంటే?
Advertisement

iQOO Z11 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) భారత మార్కెట్లోకి మరొక పవర్ ప్యాక్డ్ ఫోన్‌ను తీసుకొచ్చింది. తమ పాపులర్ Z సిరీస్‌లో భాగంగా iQOO Z11 మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. మంచి పెర్ఫార్మెన్స్, సూపర్ డిస్‌ప్లే, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. దీనికి సంబంధించిన ధర, ఫీచర్లు, సేల్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ iQOO Z11 ఫోన్ మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రారంభ వేరియంట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ.34,999 కాగా, 8GB + 128GB ధర రూ.39,999గా ఉంది. ఇక 8GB + 256GB వేరియంట్ రూ.44,999కి, టాప్ ఎండ్ 12GB + 256GB మోడల్ రూ.49,999కి లభిస్తాయి. లాంచ్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ.1,000 కూపన్ లభిస్తాయి. ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్ ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఐకూ ఇండియా వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో విక్రయానికి రానుంది.

Advertisement

Also Read: రూ.6,499కే GPS, 2 వారాల బ్యాటరీ.. హువావే కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్ ఫీచర్లు అదరగొడుతోంది!

iQOO Z11 ఫోన్ 6.83 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. గేమింగ్, వీడియా చూసే అనుభవాన్ని పెంచడానికి 144Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 2,000 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. కంటికి రక్షణగా SGS సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ కేవలం 7.99mm మందంతో, 199 గ్రాముల బరువుతో చాలా స్లిమ్‌గా డిజైన్ చేశారు. దానికి తోడు నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు.

Advertisement

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోన్ వేడెక్కకుండా చూడటానికి జెడ్ సిరీస్‌లోనే తొలిసారిగా 3,800 చదరపు మిమీ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత అరిజిన్ ఓఎస్ 6పై నడిచే ఈ ఫోన్‌కు 3 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

ఫోన్ వెనుక వైపు OIS సపోర్ట్ ఉన్న 50MP సోనీ IMX882 మెయిన్ కెమెరాతో పాటు.. 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. అలాగే సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రెండింటిలోనూ 4K వీడియోలు రికార్డ్ చేయవచ్చు. ఇక ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 7,050mAh భారీ బ్యాటరీ. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలదు. బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్, మంచి పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.

Also Read: ఐఫోన్ యూజర్లకు ఇక పండగే.. వాట్సప్ చాట్ బ్యాక్‌గ్రౌండ్ లుక్ పూర్తిగా మారిపోనుంది!

Tags

Related News

వాటర్ రెసిస్టెంట్, బెస్ట్ బ్యాటరీ..మార్కెట్‌లో ఫిలిప్స్ ఇయర్‌బడ్స్ రచ్చ

ఐఫోన్ యూజర్లకు ఇక పండగే.. వాట్సప్ చాట్ బ్యాక్‌గ్రౌండ్ లుక్ పూర్తిగా మారిపోనుంది!

బడ్జెట్ ఫ్రెండ్లీ.. సౌండ్‌బార్ కోసం చూస్తున్నారా?

మైండ్ బ్లోయింగ్ బేస్.. అదిరిపోయే లైట్స్! రూ.724కే బెస్ట్ సౌండ్‌బార్!

రూ.6,499కే GPS, 2 వారాల బ్యాటరీ.. హువావే కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్ ఫీచర్లు అదరగొడుతోంది!

బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 7900mAh బ్యాటరీతో Redmi M100!

చిన్న కిచెన్ల కోసం అదిరిపోయే..డబుల్ డోర్ ఫ్రిజ్‌లు

Big Stories

Advertisement
×