E-Paper
Advertisement

రూ.6,499కే GPS, 2 వారాల బ్యాటరీ.. హువావే కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్ ఫీచర్లు అదరగొడుతోంది!

రూ.6,499కే GPS, 2 వారాల బ్యాటరీ.. హువావే కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్ ఫీచర్లు అదరగొడుతోంది!
Advertisement

Huawei Band 11 Pro: భారత మార్కెట్లో ఫిట్‌నెస్ ప్రేమికులను ఆకట్టుకునేందుకు హువావే సరికొత్త Band 11 సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో Band 11, Band 11 Metal, Band 11 Pro మోడళ్లు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాండ్ 11 ప్రో మోడల్ పనితీరు చాలామంది యూజర్లను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చూడటానికి ఇది చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది. సుమారు 17 గ్రాముల బరువు, 8.99 mm మందంతో చేతికి పెట్టుకున్నా ఉన్నట్లే అనిపించదు. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఇందులో ఇచ్చిన 1.62 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రో మోడల్‌లో 2,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఇవ్వడం వల్ల తీవ్రమైన ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 7900mAh బ్యాటరీతో Redmi M100!

గుండె వేగం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, ఒత్తిడి వంటి వివరాలను ఇది నిరంతరం పర్యవేక్షిస్తుంది. హృదయ స్పందనల్లో మార్పులను గుర్తించే సదుపాయం కూడా ఉంది. ఇక నిద్ర నాణ్యతను, శ్వాస తీరును చాలా వివరంగా నమోదు చేస్తుంది. ఇందులో 100 కంటే ఎక్కువ వర్కౌట్ మోడ్లు ఉన్నాయి. రన్నింగ్ లేదా వాకింగ్ చేసేటప్పుడు ఫోన్ లేకుండానే రూట్‌ను ట్రాక్ చేయడానికి ప్రో మోడల్‌లో బిల్ట్‌ఇన్ GNSS (జీపీఎస్) ఫీచర్ ఇచ్చారు.

Advertisement

ఫిట్‌నెస్ విషయాలే కాకుండా ఫోన్ కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు, వెదర్, కెమెరా కంట్రోల్, క్యాలిక్యులేటర్ వంటి దైనందిన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో సమానంగా పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. సాధారణ వాడకంలో 8 రోజులు, తక్కువగా వాడితే ఏకంగా 14 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

రూ.6,499 ధరకు వస్తున్న హువావే బ్యాండ్ 11 ప్రో.. పవర్‌ఫుల్ డిస్‌ప్లే, జీపీఎస్ ట్రాకింగ్, మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తోంది. షావోమి, అమేజ్‌ఫిట్ ఉత్పత్తులకు ఇది గట్టిపోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. సరసమైన ధరలో మంచి ఫిట్‌నెస్ బ్యాండ్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఎంపిక.

Also Read: ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన ఫీచర్లు.. లీకైన Samsung Galaxy S26 FE విశేషాలు!

Tags

Related News

వంటగదిలో వినోదం మిస్ అవ్వక్కర్లేదు.. పాత గూగుల్ హోమ్ డిస్‌ప్లే ఉంటే ఇలా వాడేయండి!

Airtel ధమాకా ప్లాన్.. రూ.279‌కే నెట్ ఫ్లిక్స్ సహా 18 పైగా ఓటీటీలు.. ఇక ప్రతిరోజూ పక్కా ఎంటర్‌టైన్‌మెంట్!

BSNL ధమాకా ఆఫర్.. ఒక్క రీఛార్జ్‌‌తో 380 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, రోజూ 2GB డేటా!

వాట్సాప్‌లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్.. ఇంతకీ’రెస్ట్రిక్టెడ్ చాట్’ అంటే ఏంటీ?

ఆన్ లైన్ షాపింగ్ చేయకపోయినా పార్శిల్ వచ్చిందా? ఇలా చేస్తే..నిలువునా మోసపోతారు!

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

Big Stories

Advertisement
×