E-Paper
Advertisement

ఐఫోన్ యూజర్లకు ఇక పండగే.. వాట్సప్ చాట్ బ్యాక్‌గ్రౌండ్ లుక్ పూర్తిగా మారిపోనుంది!

ఐఫోన్ యూజర్లకు ఇక పండగే.. వాట్సప్ చాట్ బ్యాక్‌గ్రౌండ్ లుక్ పూర్తిగా మారిపోనుంది!
Advertisement

WhatsApp Animated Wallpapers: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఐఫోన్ వినియోగదారుల చాటింగ్ అనుభవాన్ని మరింత పెంచేందుకు ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌పై పనిచేస్తోంది. త్వరలోనే చాట్ థీమ్స్ కోసం యానిమేటెడ్ వాల్‌పేపర్లను పరిచయం చేయబోతోంది. దీనివల్ల ప్రతీ చాట్‌ను మనకు నచ్చినట్లు డిజైన్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

మూడు కొత్త థీమ్ కేటగిరీలు..

వాట్సప్ ఐఓఎస్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం.. వాట్సప్ ప్రధానంగా 3 రకాల థీమ్ కేటగిరీలను తీసుకురానుంది. అందులో ఫీచర్డ్, డూడుల్, మినిమల్ అనే ఆప్షన్లు ఉంటాయి. సరదాగా డిజైన్లు కోరుకునే వారికి డూడుల్, చాలా సింపుల్ అండ్ క్లీన్ లుక్ ఇష్టపడే వారికి మినిమల్ థీమ్స్ బాగా నచ్చుతాయి.

Advertisement

Also Read: వాట్సప్‌లో సరికొత్త AI Scam Alert ఫీచర్.. ఇకపై ఫ్రాడ్ మెసేజ్‌లను ముందే కనిపెట్టేయొచ్చు!

కంటికి ఇంపుగా ఉండే యానిమేషన్స్..

ఈ మూడింట్లో ఫీచర్డ్ కేటగిరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎందుకంటే.. దీనిలోనే యానిమేటెడ్ వాల్‌పేపర్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి చాట్ చేస్తున్నప్పుడు మన దృష్టిని మళ్లించేంత గందరగోళంగా ఉండవు. స్క్రీన్ వెనుక భాగంలో చాలా స్వల్పంగా, కంటికి ప్రశాంతతను ఇచ్చేలా కదులుతూ ఉంటాయి. దీనికి తోడు వాల్‌పేపర్‌కు తగ్గట్లుగా చాట్ బబుల్ కలర్స్‌ను కూడా మార్చుకునే వెసులుబాటు రానుంది.

అందుబాటులోకి ఎప్పుడు?

Advertisement

ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ డెవలప్‌మెంట్ దశలోనే ఉంది. ముందుగా ఐఫోన్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నప్పటికీ.. ఆ తర్వాత ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందించే ఆలోచనలో ఉంది. త్వరలోనే రాబోయే కొత్త వెర్షన్లలో ఇది అందరికీ అందుబాటులోకి రానుంది. ఇటీవలే పోల్స్‌లో కొత్త ఆప్షన్లు, గ్రూప్‌లలో అందరినీ ఒకేసారి ట్యాగ్ చేసే ఫీచర్లు తెచ్చిన వాట్సప్.. ఈ యానిమేటెడ్ థీమ్స్‌తో మరింత కలర్‌ఫుల్‌గా మారనుంది.

Also Read: ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన ఫీచర్లు.. లీకైన Samsung Galaxy S26 FE విశేషాలు!

Tags

Related News

వాట్సాప్‌లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్.. ఇంతకీ’రెస్ట్రిక్టెడ్ చాట్’ అంటే ఏంటీ?

ఆన్ లైన్ షాపింగ్ చేయకపోయినా పార్శిల్ వచ్చిందా? ఇలా చేస్తే..నిలువునా మోసపోతారు!

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

Big Stories

Advertisement
×