BigTV English

ED officer Suicide: ఈడీ అధికారి ఆత్మహత్య.. లంచం తీసుకున్నాడని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడంతో..

ED officer Suicide: ఈడీ అధికారి ఆత్మహత్య.. లంచం తీసుకున్నాడని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడంతో..

ED officer Suicide in Delhi(Telugu news headlines today): దేశ రాజధాని ఢిల్లీలో నిజాయితీ పరుడైన  ఓ ప్రభుత్వ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక నేరాల విచారణ ఏజెన్సీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లో ఆఫీసర్ గా పనిచేస్తున్న ఆలోక్ కుమార్ రంజన్ ఢిల్లీ సమీపంలోని సాహిబాబాద్ వద్ద రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈడీ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్న ఆలోక్ కుమార్ పై అవినీతి ఆరోపణలు రావడంతో అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యలు చెబుతున్నారు. అయితే అవినీతి కేసులో ఆలోక్ కుమార్ నిర్దోషి అని తేలినట్లు సిబిఐ అధికారులు తెలిపారు.


వివరాల్లోకి వెళితే.. సిబిఐ అధికారులు ఆగస్టు 7న ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ ను రూ.20 లక్షలు లంచం తీసుకున్నాడని అరెస్టు చేశారు. ఒక అవవీతి కేసులో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ తో కలిసి ఈడీ ఆఫీసర్ ఆలోక్ కుమార్ రంజన్ పనిచేసేవాడు. ఈ కేసులో ముంబైకి చెందిన బంగారు నగల వ్యాపారి మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ ముంబై నగల వ్యాపారిని అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.50 లక్షలు లంచం ఇవ్వాలని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ అడిగాడు.

Also Read: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’


సందీప్ సింగ్ టీమ్ లో ఈడీ ఆఫీసర్ ఆలోక్ కుమార్ రంజన్ కూడా ఉండడంతో అతడు కూడా అవినీతి పరుడేనని భావించిన ఆ నగల వ్యాపారి సిబిఐకి ఫిర్యాదు చేశాడు. దీంతో సిబిఐ అధికారులు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ ని రెండ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని వల పన్నారు. అందుకోసం ఆ నగల వ్యాపారి లంచంలో భాగంగా రూ.20 లక్షలు ఇచ్చేందుకు వెళ్లాడు. అలా సందీప్ సింగ్ లంచం తీసుకుంటున్న సమయంలో సిబిఐ అధికారులు పట్టుకున్నారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

కానీ అక్కడ ఈడీ ఆఫీసర్ ఆలోక్ కుమార్ లేడు. అయినా సిబిఐ అధికారులు అతడిని కూడా సస్పెండ్ చేశారు. అలోక్ కుమార్ ని తరుచూ విచారణ పేరుతో ప్రశ్నించారు. అతడిని జైలుకు పంపుతామని బెదిరించారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆలోక్ కుమార్ రంజన్ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మ హత్య చేసుకున్నాడు. సిబిఐ అధికారుల విచారణలో అలోక్ కుమార్ నిర్దోషి అని తేలే లోపు విషాదం జరిగిపోయింది.

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×