Dosa Eating Viral Video: దోశ అనగానే, పక్కనే చట్నీ, వేడి వేడి సాంబార్ గుర్తొస్తుంది. సాధారణంగా దోసెను చేత్తోనే తినడం చాలామందికి అలవాటు. కానీ, ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో దోశ తినాలంటే సవాలక్ష కండీషన్స్ పెడుతోంది. దోశ ధర ఏకంగా రూ.1,500 పెట్టడంతో పాటు, దాన్ని చేత్తో తినకుండా ఫోర్క్, స్పూన్ తో ఎలా తినాలో ట్రైనింగ్ కూడా ఇస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రకారం, ఫైవ్ స్టార్ హోటల్ లో దోశను సాధారణంగా చేత్తో తినడం కంటే ఫోర్క్, స్పూన్ లాంటి కట్లరీతో తినే పద్ధతిని పాటించాలట. వీడియోలో కూడా దోశను ఎలా కట్ చేయాలి? ఫోర్క్ తో ఎలా పట్టుకోవాలి? స్పూన్ ను ఎలా ఉపయోగించాలి? అనే అంశంపై ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. దీంతో దోశ తినడానికి కూడా స్పెషల్ ట్రైనింగ్ అవసరమా అంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
సాధారణ హోటల్ లో దొరికే దోశ ధర రూ. 50 ఉంటుంది. కొన్ని చోట్ల రూ. 100 ఉంటుంది. కానీ, దీని ధర ఏకంగా రూ.1,500. అయితే, ఫైవ్‌స్టార్ హోటళ్లలోకి వెళ్తే జేబులు ఖాళీ అవడం పక్కా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ఫైవ్ స్టార్ హోటల్లో ఫుడ్ ధర కేవలం వంటకానికే కాకుండా, వాతావరణం, సర్వీస్, ప్రెజెంటేషన్ లాంటి అంశాలను కూడా కలుపుకుని నిర్ణయిస్తారని కామెంట్స్ పెడుతున్నారు. అందుకే అక్కడ అందించే సాధారణ వంటకాలకు కూడా ఎక్కువ ధర ఉంటుందంటున్నారు.
నిజానికి దోశను చేత్తో తినడం భారతీయ ఆహార సంస్కృతిలో సాధారణమైన విషయం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో దోశ, ఇడ్లీ, వడ వంటి వంటకాలను చేత్తో తినడం చాలామందికి అలవాటు. అయితే, ఫైవ్‌స్టార్ లేదా లగ్జరీ రెస్టారెంట్లలో టేబుల్ ఎటికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ అందించే వంటకాలను కట్లరీతో తినడం సాధారణంగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఈ వీడియో సరదాగా చూపించినట్లు తెలుస్తోంది.
వీడియో బయటకు వచ్చిన తర్వాత నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. “దోశ తినడానికి కూడా ట్రైనింగ్ అవసరమా?” అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు “రూ.1,500 దోశను చేత్తో తినడానికి కూడా అనుమతి ఉండదా?” అంటూ సరదాగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు దోశ తినడానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు. కానీ, రూ.1,500 ఫైవ్‌స్టార్ దోశ తినాలంటే ఫోర్క్, స్పూన్ పట్టుకోవాల్సిందే అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
When you pay ₹1,500 for a dosa at a 5-star hotel, apparently you are not allowed to eat it with your hands. 🤣
Fork and spoon are compulsory!
Here is the official training video on how to eat a dosa like a 5-star guest 🙂 pic.twitter.com/XjPfGlTEN1
— Manas Muduli (@manas_muduli) August 17, 2026
Read Also: దేవుడి విగ్రహం పగలగొట్టి.. యముడికి ఛాలెంజ్, తర్వాతి రోజే ఘోర ప్రమాదం, చివరికి..