ISRO LVM3-M5 Launch: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతోంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5.26 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఎల్ఎం3-ఎం5 రాకెట్ (LVM3-M5) ప్రయోగానికి సిద్ధమైంది. ఈ రాకెట్ ద్వారా సీఎంఎస్–03 (CMS-03) అనే ఆధునిక సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
ఈ ఉపగ్రహం బరువు సుమారు 4410 కిలోలుగా ఉంది. ప్రయోగం అనంతరం కేవలం 16 నిమిషాలు 09 సెకండ్లలోనే శాటిలైట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.
ఈ ఉపగ్రహం ప్రధానంగా భారత సముద్రతీర ప్రాంతాలు, హిందూ మహాసముద్ర పరిసరాలు, సైనిక అవసరాలు, తీర ప్రాంత రక్షణ చర్యలు కోసం రూపకల్పన చేయబడింది. సీఎంఎస్–03 ద్వారా సముద్ర పరిసర పరిస్థితులను పర్యవేక్షించడం, నౌకా చలనం గమనించడం, వాతావరణ మార్పులను గుర్తించడం వంటి.. అనేక ఉపయోగకరమైన సమాచారాన్ని భూమికి పంపే అవకాశం ఉంది.
ఎల్ఎం3 (LVM3) రాకెట్ ప్రస్తుతం ఇస్రోలో అత్యంత శక్తివంతమైన లాంచ్ వెహికల్‌గా పరిగణించబడుతోంది. దీని పూర్వ రూపం జీఎస్‌ఎల్‌వీ మార్క్–3, దీన్ని తర్వాత లాంచ్ వెహికల్ మార్క్–3 (LVM3)గా మార్చారు. చంద్రయాన్–3, గగనయాన్ మిషన్లను కూడా ఇదే రాకెట్ తరహాలో నిర్వహించారు.
ఇస్రో శాస్త్రవేత్తల ప్రకారం, రాకెట్ కౌంట్‌డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. అన్ని సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, శ్రీహరికోట తీర ప్రాంతంలో గాలుల వేగం తక్కువగా ఉందని, రాకెట్ ప్రయోగానికి ఎలాంటి ఆటంకం లేనట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
Also Read: శబరిమల బంగారం వివాదంలో ట్విస్ట్..2019 లోనే రాగిగా మార్చేసి!! ఎంత చోరీ అయ్యిందంటే
ప్రయోగం సాయంత్రం 5.26 గంటలకు ప్రారంభమై, కేవలం 16.09 నిమిషాల్లో సీఎంఎస్–03 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అనంతరం ఉపగ్రహం నుంచి భూమికి సిగ్నల్స్ రావడం ప్రారంభమవుతుందని అంచనా.
నేడే ఎల్ఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం..
సాయంత్రం 5.26 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగం
ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపనున్న సీఎంఎస్-03 సమాచార ఉపగ్రహం
4410 కిలోల బరువు కలిగిన ఉపగ్రహం
16.09 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేసి ఉపగ్రహాన్ని కక్ష్యలో… pic.twitter.com/XG81wbFAWj
— ChotaNews App (@ChotaNewsApp) November 2, 2025