CM Revanth Reddy – Tollywood: సినీ పరిశ్రమకు, సెలబ్రిటీలకు ఎలాంటి సమస్య వచ్చినా వారిని ముందుండి నడిపించేవారు కొందరు ఉంటారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ముఖ్యంగా రాజకీయ నాయకులతో సినీ పరిశ్రమ గురించి, సినీ సెలబ్రిటీలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కచ్చితంగా చిరంజీవి అక్కడ ఉంటారు. అదే విధంగా సినీ ప్రముఖులంతా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా లిస్ట్‌లో ముందుగా మెగాస్టార్ పేరే ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ మీటింగ్‌కు చిరంజీవి రాలేకపోయారు. దీనికి కారణాలు ఏంటని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి.
అదే కారణమా
ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న గందరగోళాలు, దాంతో పాటు ఇతర సమస్యల గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయించారు దిల్ రాజు. ఆ మీటింగ్‌కు నటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా అందరూ కలిసి మొత్తం 36 మంది వెళ్తారని ముందుగానే ప్రకటించారు. ఇక ఈ లిస్ట్‌లో ముందుగా చిరంజీవి పేరే ఉంది. ఏ మీటింగ్‌కు అయినా చిరంజీవి వెళ్తే సామరస్యంగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతారు. కానీ చివరి నిమిషంలో ఆయన రాలేకపోయారు. దీని వెనుక అనేక సందేహాలు వినిపిస్తున్నా కూడా ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ వల్ల చిరంజీవి (Chiranjeevi) ఈ మీటింగ్‌కు రాలేకపోయారని తెలుస్తోంది.
Also Read: బన్నీ ఫ్యాన్స్‌కు షాక్.. ‘పుష్ప 2’ రికార్డులను రెండు రోజుల్లోనే బ్రేక్ చేసిన ‘యూఐ ది మూవీ’
షూటింగ్‌లో బిజీ
ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ తర్వాత ఇది పోస్ట్‌పోన్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి కూడా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు. అందుకే ఇలా షూటింగ్ చివరి దశలో ఉన్న సమయంలో బ్రేక్ ఇవ్వడం కష్టమనే కారణంతో సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్‌కు కూడా హాజరు కాలేకపోయారట చిరంజీవి. కానీ తాను మాట్లాడాలనుకుంటున్న మాటలు, అడగాలనుకుంటున్న ప్రశ్నలను ఇతర సినీ ప్రముఖులతో పంపించారని సమాచారం.
ఇద్దరు మెగా హీరోలు
చిరంజీవి కూడా సీఎంతో మీటింగ్‌కు రావాలని ఫిక్స్ అయ్యారు. కానీ చివరి నిమిషంలో ‘విశ్వంభర’ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వలేక మీటింగ్ నుండి తప్పుకున్నారు. అందుకే మెగా ఫ్యామిలీ నుండి తను లేని లోటును తీర్చడానికి ఇద్దరు హీరోలను పంపించారు. రేవంత్ రెడ్డితో మీటింగ్‌కు ఇతర సినీ ప్రముఖులతో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు వెళ్లారు. దీంతో మెగా హీరోలు లేని లోటు తీరుతుంది. ఇక రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల మీటింగ్ ముగిసే సమయానికి ఇరువురు తమ తమ అభిప్రాయాలను బయటపెట్టారు. మీటింగ్ సజావుగా సాగింది. అంతే కాకుండా సినీ ప్రముఖులు దేనికోసం అయితే ఈ మీటింగ్ పెట్టారో.. అందులో చాలావరకు సక్సెస్ అయినట్టే తెలుస్తోంది.