Virat Kohli – sam Konstas: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ – ఆస్ట్రేలియా మధ్య నాలుగో (బాక్సింగ్ డే) టెస్ట్ ప్రారంభమైంది. ఈ నాలుగో టెస్టులో భారత జట్టు కేవలం ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమీన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ పిచ్ స్పిన్నర్ లకు అనుకూలిస్తుందనే అంచనాల మధ్య మరో స్పిన్నర్ ని జట్టులోకి తీసుకుంది భారత జట్టు.
Also Read: India vs Australia 4th Test: దాటిగా ఆడుతున్న ఆస్ట్రేలియా.. గిల్ లేకుండానే బరిలోకి టీమిండియా!
ఈ సిరీస్ లో ఆశించినంత మేర రాణించలేకపోతున్న శుభమన్ గిల్ ని జట్టు నుంచి తప్పించి.. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ ని తీసుకుంది. ఆస్ట్రేలియా జట్టు కూడా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. 19 ఏళ్ల ఓపెనర్ సామ్ కొంటాస్ ని జట్టులోకి తీసుకుంది. ఇక గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగిన జోష్ హెజిల్ వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ ని ఎంపిక చేసింది. ఈ మ్యాచ్ తొలి రోజు విరాట్ కోహ్లీ కాస్త అతి చేసినట్లు కనిపించింది. గ్రౌండ్ లో ఎప్పుడూ దూకుడుగా ఉంటూ ప్రత్యర్ధులపై పై చేయి సాధించే కోహ్లీ.. ఈసారి కాస్త తొందర పడ్డట్లుగా కనిపించింది.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పదవ ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత బౌలర్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్ కాన్ స్టాస్ మధ్య మాటల యుద్ధం జరగగా.. ఆ ఓవర్ పూర్తయ్యాక విరాట్ కోహ్లీ దూకుడుగా వెళ్తూ స్యామ్ కాన్ స్టాస్ భుజాన్ని తన భుజంతో ఢీకొట్టాడు. ఈ సందర్భంగా ఇరువురు ప్లేయర్ల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆ వెంటనే అంపైర్లతో పాటు మరో ఓపినర్ ఉస్మాన్ ఖవాజా వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే కోహ్లీ తీరుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందించారు. వీరిద్దరూ కామెంట్రీ బాక్స్ లో ఉన్నారు. అయితే కోహ్లీ చర్య పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కాన్ స్టాస్ తన దారిన తాను వెళుతుంటే విరాట్ తన డైరెక్షన్ మార్చుకొని ఇలా చేశాడని అన్నారు. “కోహ్లీ ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్. కానీ భుజాలు తాకిన తర్వాత విరాట్ “నేనెందుకు అలా చేస్తా” అన్నట్లుగా అనిపించింది.
ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ దృష్టి సారించాలి”. అని కామెంట్రీ బాక్స్ లో ఉన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్ కాన్ స్టాస్ తన విశ్వరూపాన్ని చూపించాడు. అప్పటివరకు నెమ్మదిగా అడుగుతున్న అతడు ఒక్కసారిగా టి20 మోడ్ లోకి వచ్చేసాడు. దొరికిన బంతిని దొరికినట్లుగా చితకబాది బౌండరీలు సాధించాడు. బూమ్రా బౌలింగ్ లో భారీ షాట్స్ ఆడే సాహసం ఎవరు చేయరు.
Also Read: Naman Ojha’s Father: టీమిండియా క్రికెటర్ తండ్రికి 7 ఏళ్ల జైలు శిక్ష?
కానీ ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ మాత్రం బూమ్రా బౌలింగ్ లో రెచ్చిపోయి ఆడాడు. ర్యాంప్ షాట్స్ తో బౌండరీలు బాదాడు. అంతేకాదు ఓ సిక్సర్ కూడా బాదాడు. ఈ క్రమంలో స్యామ్ కాన్ స్టాస్ 65 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడ అయితే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 176 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం లబుషేన్ (44*), స్టీవెన్ స్మిత్ (10*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో బూమ్రా ఒక వికెట్, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
Kohli and Konstas come together and make contact 👀#AUSvIND pic.twitter.com/adb09clEqd
— 7Cricket (@7Cricket) December 26, 2024