Jani Master:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు జానీ మాస్టర్ (Jani Master). ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకే తన టాలెంట్ ను పరిచయం చేయకుండా.. సౌత్ ఇండియా అంతటా మంచి పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా కన్నడలో ఈయన కొరియోగ్రఫీ అందించిన ఒక చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇక మరొకవైపు కోలీవుడ్లో ధనుష్ (Dhanush) హీరోగా వచ్చిన ‘తిరు’ సినిమాకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది.. కానీ అవార్డు అందుకోలేకపోయారు. దీనికి కారణం లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అవ్వడమే.
లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్
తన దగ్గర పనిచేసే లేడీ అసిస్టెంట్ పై లైంగికంగా దాడి చేశాడని , ఈ కేసులోనే ఈయన అరెస్టు చేయబడ్డారు..
ఇకపోతే ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తొలిసారి జనసేన పార్టీ గురించి స్పందించి అందరిని ఆశ్చర్యపరిచారు జానీ మాస్టర్. లైంగిక ఆరోపణల చేతిలో దాదాపు నెల రోజులపాటు జైల్లో ఉన్న జానీ మాస్టర్ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చాక, కొన్ని రోజులు ఎవరికి కనపడకుండా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్..
ఈ క్రమంలోనే తాజాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ తన భార్యతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక సంగతులను ఆయన మాట్లాడడం జరిగింది. ఇకపోతే కేసు ఇంకా కోర్టులో ఉండడంతో ఆరోపణలపై స్పందించలేదు జానీ మాస్టర్. ఇదిలా ఉండగా.. జనసేన పార్టీలో జానీ మాస్టర్ కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు రాగానే పార్టీ నుండి ఆయనను సస్పెండ్ చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా ఆదేశించారు.
జనసేన పార్టీ పై స్పందించిన జానీ మాస్టర్..
ఒక దీనిపై జానీ మాస్టర్ స్పందిస్తూ.. జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయానికి నేను ఎంతో బాధపడ్డాను. కానీ కొన్ని పార్టీ రూల్స్ కూడా ఉంటాయి కదా..ప్రతిపక్షాలు దీనిని ఆసరాగా తీసుకొని రాద్ధాంతం చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి నేను హ్యాపీగా ఉన్నాను. ఆ నిర్ణయం నేను తప్పు అని చెప్పలేదు. నేను ఆ పొజిషన్ లో ఉన్నా సరే అలాగే చేస్తాను. ముఖ్యంగా పార్టీ ఆదేశాల ప్రకారం నేను జనసేన పార్టీ పేరును ఎప్పటికీ వాడను. కానీ రెగ్యులర్గా చేసే సేవ కార్యక్రమాలు మాత్రం చేస్తాను అంటూ తెలిపారు జానీ మాస్టర్. ఇకపోతే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఎవరైనా ఈ విషయంలో సపోర్ట్ చేశారా అని అడగగా.. జానీ మాస్టర్ మాట్లాడుతూ.. కళ్యాణ్ సార్ సైలెంట్ గా ఉన్నారు. రామ్ చరణ్ కూడా సైలెంట్ గా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం నేనేంటో వారికి తెలుసు. నేను క్లీన్ గా బయటకు రావాలి. సపోర్ట్ ఇస్తేనే పవన్ కళ్యాణ్ జిందాబాద్ లేకపోతే లేదనే వాడిని కాదు. నా మనసులో వాళ్ళ మీద ఎప్పటికీ ప్రేమ ఉంటుంది” అంటూ జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జానీ మాస్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.