BigTV English

WhatsApp : వాట్సాప్ కాల్ షెడ్యూల్ ఆప్షన్.. ఎలా ఉపయోగించాలో తెలుసా!

WhatsApp : వాట్సాప్ కాల్ షెడ్యూల్ ఆప్షన్.. ఎలా ఉపయోగించాలో తెలుసా!

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ఉండే ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఉపయోగిస్తున్న ఈ యాప్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ను తీసుకొస్తూనే ఉంటుంది. ఇక ఇండియాలో సైతం ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో 62 శాతం మంది వాట్సాప్ ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అసలు వాట్సాప్ లో ఎంతో ఉపయోగపడే ఓసరి కొత్త ఫీచర్ సైతం ఉందని.. కాల్స్ షెడ్యూల్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.


వాట్సాప్ ను ఉపయోగిస్తున్న చాలామందికి కూడా తెలియని ఒక విషయం వాట్సాప్ కాల్ షెడ్యూల్. ఈ ఆప్షన్ ను ఉపయోగిస్తే ముఖ్యమైన కాల్స్, సందేశాలు, ఆహ్వానాలను మర్చిపోయే ఛాన్స్ ఉండదు. అంతేకాకుండా మీకు కావాల్సిన పనులన్నీ సమయానికే పూర్తవుతాయి. అయితే ఇందుకోసం పెద్దగా మార్పులు చెయ్యాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లో కొన్ని సెట్టింగ్స్ మారిస్తే చాలు. ఏ థర్డ్ పార్టీ యాప్ హెల్ప్ తీసుకోకుండానే వాట్సప్ లో కాల్స్ షెడ్యూల్ చేయవచ్చు.

నిజానికి వాట్సాప్ లో కాల్స్ షెడ్యూల్ చేయడం ఎంతో తేలిక. ఇందుకోసం ఫోన్ లో వాట్సాప్ ను ఓపెన్ చేసి కాల్ చేయాలనుకుంటున్న గ్రూప్ ను ఓపెన్ చేయాలి. మెసేజ్ బార్ కి కింద వైపున కనిపిస్తున్న ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఇక కుడివైపున కనిపిస్తున్న ఫోటో, కెమెరా, లోకేషన్ తో పాటు ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటన్నిటిలో ఈవెంట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇలా ఈవెంట్ ను క్రియేట్ చేయాలి. ఈవెంట్ లో సమయాన్ని సెట్ చేస్తే సరి. ఇక లింకుతో సమావేశాన్ని ప్రారంభించాలనుకుంటే టోగూన్ ఆఫ్షన్ పై క్లిక్ చేస్తే చాలు. ఇందులో వీడియో, ఆడియో కాల్స్ మధ్య సమయాన్ని సైతం సెట్ చేసే ఛాన్స్ ఉంది. ఆ పై చివరగా సెండ్ బటన్ పై క్లిక్ చేస్తే కాల్ షెడ్యూల్ అయిపోతుంది.


ఇక ఒకసారి కాల్ షెడ్యూల్ చేసిన తర్వాత ఏదైనా కారణంతో రద్దు చేయాలనుకున్నా కానీ చాలా తేలిక. ఇందుకు కూడా వాట్సాప్ అవకాశం కల్పించింది. చాట్ లోకి వెళ్లి అదే మీటింగ్ షెడ్యూల్ లోనే ఎడిట్ పై క్లిక్ చేయాలి. ఆపై దాన్ని రద్దు చేస్తే సరి.

ఇక ఈ ఆప్షన్ తో పాటూ వాట్సాప్ ఎన్నో ఆప్షన్స్ ను సైతం తీసుకొచ్చేసింది. ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో వచ్చిన అప్డేట్స్ తో ఈ యాప్ ను ఉపయోగించడం మరింత తేలిక అయిపోయింది. దీంతో పాటు వాట్సప్ కాలింగ్ ఫీచర్ ఆప్షన్, స్టిక్కర్ క్రియేషన్, డ్రాఫ్ట్ మెసేజ్ ఫీచర్, వీడియో కాల్ సెట్టింగ్స్ వంటి ఎన్నో లేటెస్ట్ ఫీచర్స్ ను వాట్సప్ తీసుకొచ్చేసింది. వీటన్నింటితో పాటూ ప్రైవసీని సైతం మరింత పెంచడానికి కొన్ని డివైసెస్ లో వాట్సాప్ యాక్సెస్ ను సైతం ఆపేసింది మెటా. ఇక గత ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురావడంతో ఈ ఏడాది ఇందుకు అనుగుణంగా మరిన్ని ఫీచర్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మరి చూడాలి మెటా ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ తీసుకువస్తుందో!

ALSO READ : మీ కిచెన్ లో ఎయిర్ ఫ్రైయర్ మీపై నిఘా ఉంచింది బాస్! జాగ్రత్త

Related News

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Xiaomi Rival iPhone 17: ఐఫోన్ 17కు సవాల్.. రాబోతోంది షావోమీ సూపర్ ఫోన్

Big Stories

×