BigTV English
Advertisement

Japan:- గాలి నుండి నీటి తయారీ.. జపాన్ కొత్త ఆలోచన..

Japan:- గాలి నుండి నీటి తయారీ.. జపాన్ కొత్త ఆలోచన..

Japan:- నీరు, గాలి.. ఈ రెండు మానవాళి జీవనానికి చాలా ముఖ్యం. కానీ ఈరోజుల్లో కాలుష్యం బారిన పడుతున్న వాటిలో ఈ రెండే ప్రధాన స్థానాల్లో ఉన్నాయి. అందుకే గాలిని, నీటిని ప్యూరిఫై చేయడానికి ఎన్నో కొత్త కొత్త విధానాలను కనుగొంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా ఈజిప్ట్ శాస్త్రవేత్తలు.. ఇప్పుడు ఉన్న పరిశోధనలు అన్నింటిని దాటి కొత్త రకమైన పరిశోధనకు శ్రీకారం చుట్టారు. వారి గాలితో నీటిని తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.


గాలితో నీటి తయారీ ఏంటి అని ఆశ్చర్యంగా ఉన్నా.. దానిని నిజం చేస్తామంటున్నాయి జపాన్, ఈజిప్ట్. ఒక కొత్త టెక్నాలజీ సాయంతో గాలి నుండి నీటిని తయారు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది జపాన్ సంస్థ మిజుహా. ఈ పరికరానికి కుసూ అనే పేరు పెట్టారు. అంటే జపాన్ భాషలో నీరు, గాలి అని అర్థం. ఇది ఒక వాటర్ కూలర్. ఈ వాటర్ కూలర్ గాలిలో ఉండే ఆవిరిని పీల్చుకొని తాగునీటిలాగా మారుస్తుంది. ఇది ఐరన్ ఎక్స్‌ఛేంజ్ సిస్టమ్, కార్బన్ ఫిల్టర్స్ లాంటి ఫీచర్‌తో తయారు చేయబడుతుంది.

చాలాకాలంగా గాలి నుండి నీటిని తయారు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమయి ఉన్న మిజుహ సంస్థ మరో రెండు నెలల్లో దీని ప్రొడక్షన్‌ను పూర్తి చేసి మార్కెట్లోకి లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ విషయాన్ని ఆ సంస్థ హెడ్ స్వయంగా ప్రకటించారు. గాలిలోని ఆవిరి శాతాన్ని బట్టి ఈ పరికరం రోజుకు 14 లీటర్ల తాగునీటిని తయారు చేయగలుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీలకు, టూరిస్ట్ రిసార్టులకు ఈ పరికరం కమర్షియల్ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చెప్తోంది.


ఈ వాటర్ ఎక్స్‌ట్రాక్టర్స్ అనేవి పూర్తిగా మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత ఈజిప్ట్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ వంటి దేశాలకు దీనిని ఎగుమతి చేయాలని మిజుహా లక్ష్యంగా పెట్టుకుంది. ఈజిప్ట్‌ మార్కెట్‌కు తగినట్టుగా కుసులో మార్పులు చేస్తామని, అక్కడ సేల్స్‌ను పెంచడానికి ఎలాంటి మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మిజుహా చెప్తోంది. జపాన్‌లో నీటిని దేవుడిగా భావిస్తారు. అందుకే మిజుహా నోమా అనే పేరుతో పిలుచుకుంటారు. అందుకే ఈ సంస్థకు మిజుహా అనే పేరు పెట్టినట్టు బయటపెట్టారు.

ప్రస్తుతం ఈజిప్ట్‌లో నీటి కరువు చాలా ఉంది. కనీస సదుపాయాలకు కూడా అక్కడ చాలామందికి ప్రజలకు నీటి సౌకర్యం లభించడం లేదు. అవసరమైనదానికంటే 55 శాతం తక్కువ నీటి సదుపాయంతో అక్కడి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. అందుకే కుసు అక్కడి వారికి తాగునీటిని అందించడానికి సహాయంగా నిలుస్తుందని మిజుహా భావిస్తోంది. వాటర్ సిస్టమ్‌ను పెంపొందించడానికి ఈజిప్ట్‌లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ పూర్తిస్థాయిలో ప్రజలు సాయంగా నిలవడం లేదు. అందుకే మిజుహా ఈ ఆలోచనతో ముందుకొచ్చింది.

టిక్‌టాక్‌కు భారీ ఫైన్.. ఎందుకంటే..?

for more updates follow this link:-Bigtv

Tags

Related News

APK Files: ఏదైనా లింక్ చివరన apk అని ఉంటే.. అస్సలు ఓపెన్ చేయొద్దు, పొరపాటున అలా చేశారో..

Realme Discount: 50 MP ట్రిపుల్ కెమెరా గల రియల్‌‌మి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ15000 డిస్కౌంట్.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

Apple Satellite Features: నెట్ వర్క్ లేకున్నా అవి చూసేయొచ్చు, ఆపిల్ యూజర్లకు పండగే పండుగ!

AI Browser Risk: ఏఐ బ్రౌజర్లు ప్రమాదకరం.. బ్యాంక్ అకౌంట్లు ఖాళీనే.. హెచ్చరిస్తున్న నిపుణులు

Google Gemini Pro: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై గూగుల్ జెమిని ప్రో ఫ్రీగా వాడుకోవచ్చు!

Free AI: ఉచిత ఏఐ ఒక ఉచ్చు.. భారతీయులే వారి ప్రొడక్ట్!

Battery Phones Under Rs10k: రూ.10,000 లోపు బడ్జెట్‌లో 5000mAh బ్యాటరీ ఫోన్లు.. 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు

Vivo 5G Premium Smartphone: వివో నుంచి ప్రీమియం 5జి ఫోన్‌.. ఫీచర్లు చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

Big Stories

×