E-Paper
Advertisement

థియేటర్లకే బాస్ ఈ జేబీఎల్ బీస్ట్..ఆడియో లవర్స్ కోసం అల్టిమేట్ గ్యాడ్జెట్

థియేటర్లకే బాస్ ఈ జేబీఎల్ బీస్ట్..ఆడియో లవర్స్ కోసం అల్టిమేట్ గ్యాడ్జెట్
Advertisement

JBL Bar 1000MK2 review: ప్రస్తుత కాలంలో.. మంచి సినిమా చూడాలన్నా..లేదా ఇష్టమైన పాటలు వినాలన్నా.. కేవలం పిక్చర్ క్వాలిటీ ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా చెవులను హోరెత్తించే డాల్బీ ఆడియో లేదా సరౌండ్.. సౌండ్ ఉండాల్సిందే. అందుకే.. టెక్ మార్కెట్‌లో ఆడియో ప్రొడక్ట్స్‌కు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే. ఈ కోవకే చెందిన ప్రముఖ ఆడియో బ్రాండ్ జేబీఎల్ (JBL), తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ప్రీమియం మోడల్ ‘JBL Bar 1000MK2’. కేవలం సౌండ్‌బార్ అనడం కంటే ఇది ఒక కంప్లీట్ హోమ్ థియేటర్ సిస్టమ్ అని చెప్పవచ్చు. దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

డిటాచబుల్ సరౌండ్ స్పీకర్లు :

ఈ సౌండ్‌బార్‌లో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే.. దీని వైర్‌లెస్ డిటాచబుల్ సరౌండ్ స్పీకర్లు. మెయిన్ సౌండ్‌బార్ చివర ఉండే.. రెండు చిన్న స్పీకర్లను విడదీసి మీ రూమ్ వెనక వైపు పెట్టుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి వైర్ల గొడవ లేకుండా రియల్ 3D సర్రౌండ్ సౌండ్ ఫీల్ కలుగుతుంది. సినిమాలు చూస్తున్నప్పుడు హెలికాప్టర్ వెనక నుంచి వెళ్తున్నట్టు లేదా వర్షం కురుస్తున్నట్టు స్పష్టమైన ఆడియో ఎఫెక్ట్స్ మనకు వినిపిస్తాయి.

డాల్బీ అట్మాస్ , DTS:X సపోర్ట్:

Advertisement

JBL Bar 1000MK2 లో డాల్బీ అట్మాస్, DTS:X టెక్నాలజీని సపోర్ట్ చేసే పవర్ ఫుల్ డ్రైవర్లు ఉన్నాయి. ఇవి రూంలోని ప్రతి మూలకు సౌండ్‌ను సమానంగా అందేలా చేస్తుంది. ఇక బేస్ లవర్స్ కోసం ఇందులో ప్రత్యేకంగా 10 అంగుళాల వైర్‌లెస్ సబ్-వూఫర్ వస్తుంది. కాబట్టి ఇది ఇచ్చే డీప్ బాస్ ఎఫెక్ట్ వల్ల యాక్షన్ సీన్లు చూస్తున్నప్పుడు ఇంట్లోనే థియేటర్ వైబ్స్ కచ్చితంగా వస్తాయి.

స్మార్ట్ కనెక్టివిటీ , ఫీచర్లు:

ఈ ఆడియో సిస్టమ్‌లో వైఫై, బ్లూటూత్, హెచ్‌డీఎంఐ పోర్టులు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌ప్లే , అలెక్సా మ్యూజిక్ కాస్ట్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ ఉండటం వల్ల మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ నుంచి నేరుగా పాటలను స్ట్రీమ్ చేసుకోవచ్చు. JBL One యాప్ ద్వారా మీ టేస్ట్‌కు తగినట్టుగా ఈక్వలైజర్ సెట్టింగ్స్‌ను ఈజీగా మార్చుకోవచ్చు.

Advertisement

Also Read: సగం ధరకే.. 50 ఇంచుల టీవీలు,ఆఫర్ పూర్తవకముందే కొనండి

ధరలు :

ఈ ప్రీమియం JBL Bar 1000MK2 సౌండ్‌బార్ ధర విషయానికి వస్తే.. గ్లోబల్ మార్కెట్, ఇండియాలో దీని  ధర సుమారు రూ. 95,000 నుంచి రూ. 1,10,000 వరకు ఉండవచ్చు (ధరలు ఫీచర్లు, ట్యాక్స్‌లు ,ఆఫర్లను బట్టి మారుతుంటాయి). ఇది కొంచెం ఖరీదైనది అయినప్పటికీ.. ఇది అందించే ప్యూరిటీ, పవర్ , థియేట్రికల్ ఆడియో ఫీల్ ముందు ఆ ఖర్చు తక్కువే అనిపిస్తుంది.

మీ ఇంటిని ఒక మినీ సినిమా హాల్‌గా మార్చుకోవాలని ఆశ పడుతుంటే.. ప్రీమియం క్వాలిటీతో రాజీ పడని వారికి ‘JBL Bar 1000MK2’ ఒక బెస్ట్ అండ్ అల్టిమేట్ ఛాయిస్!

Related News

చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేలు చదవడం ఎలా?

డిలీట్ అయిన ఫోటోలు మళ్లీ కావాలా? ఈ సీక్రెట్ సెట్టింగ్ మీ కోసమే

బెస్ట్ బ్లూటూత్ స్పీకర్..ఏఐ సౌండ్‌తో ఇల్లు దద్దరిల్లిపోతుంది

పాత టీవీ రిమోట్ పారేస్తున్నారా? ఈ 6 ట్రిక్స్ తెలిస్తే.. ఇంకెప్పుడు ఆ తప్పు చేయరు!

శాంసంగ్ A18 4G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఏఐ టూల్స్.. అదిరిపోయింది మామ!

థియేటర్‌ను మించిన సౌండ్ &పిక్చర్ క్వాలిటీ..తక్కువ ధరకే అదిరిపోయే టీవీ

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.51 కే అపరిమిత 5G డేటా.. ఇది కదా ప్లాన్ అంటే!

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్‌ కార్డ్‌..రూ.1275కే MIOX మ్యాజిక్ పవర్ బ్యాంక్!

Big Stories

Advertisement
×