E-Paper
Advertisement

తెలంగాణ రెరా కీలక నిర్ణయం.. రియల్‌ ఎస్టేట్ రంగానికి భారీ ఊరట!

తెలంగాణ రెరా కీలక నిర్ణయం.. రియల్‌ ఎస్టేట్ రంగానికి భారీ ఊరట!
Advertisement

TG RERA Extends: పశ్చిమ ఆసియా ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, దానికి తోడు అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక రంగాణపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మన దగ్గర కూడా దీని ప్రభావం పడటంతో, నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. బిల్డర్లకు, డెవలపర్లకు కొంత రిలీఫ్ ఇస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.

గడువు పొడిగింపు.. ఎవరికి వర్తిస్తుంది?

Advertisement

రాష్ట్రంలో రెరా పరిధిలో నమోదైన ప్రాజెక్టుల పూర్తి గడువును ఉమ్మడిగా నాలుగు నెలల పాటు పొడిగిస్తున్నట్లు టీజీ రెరా ప్రకటించింది. ముఖ్యంగా ఫిబ్రవరి 28, 2026 నాటికి కానీ, ఆ తర్వాత కానీ పూర్తి కావాల్సిన ప్రతీ రెరా నమోదిత ప్రాజెక్టుకు ఈ నాలుగు నెలల అదనపు గడువు వర్తిస్తుందని అథారిటీ స్పష్టం చేసింది. దీనివల్ల గడువు ముగింపు దశలో ఉండి, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయలేక ఒత్తిడి ఎదుర్కొంటున్న ప్రమోటర్లకు భారీ ఊరట లభించినట్లయింది.

నిర్ణయానికి కారణాలేంటి?

Advertisement

యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా రవాణా వ్యవస్థ, సరుకుల సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిర్మాణ రంగానికి అత్యంత కీలకమైన స్టీలు, సిమెంట్, ఇతర ముడి సరుకుల లభ్యత తగ్గడమే కాకుండా రవాణా ఛార్జీలు పెరగడం, దిగుమతుల్లో జాప్యం జరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిర్మాణాలు అనుకున్న సమయానికి పూర్తి కావడం కష్టమని గ్రహించిన టీజీ రెరా, ప్రాజెక్టుల అమల్లో జాప్యాన్ని ముందే ఊహించి ఈ సమయోచిత నిర్ణయం తీసుకుంది.

Also Read: మేడ్చల్‌లో కార్పొరేషన్ పేరిట ఘోరం.. కమిషనర్ ముందే గళమెత్తిన జనం!

Tags

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×