E-Paper
Advertisement

సౌండ్ అదిరింది.. బడ్జెట్ కుదిరింది! ట్రెండింగ్ లో JBL Go 3 స్పీకర్

సౌండ్ అదిరింది.. బడ్జెట్ కుదిరింది! ట్రెండింగ్ లో JBL Go 3 స్పీకర్
Advertisement

JBL Go 3 Review: మీరు ఎక్కడికి వెళ్లినా మ్యూజిక్ మీతోనే ఉండాలా ? అది కూడా జేబులో ఇమిడిపోయే సైజులో, అదిరిపోయే సౌండ్ ఇచ్చే బ్రాండెడ్ స్పీకర్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసమే .. JBL Go 3 Portable Waterproof Speaker మార్కెట్లో దుమ్ము రేపుతోంది. కేవలం రూ.2,299 బడ్జెట్ ధరలో లభించే.. ఈ మినీ పవర్‌హౌస్ స్పీకర్ ఫీచర్లు, బ్యాటరీ లైఫ్ , పర్ఫార్మెన్స్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

JBL Go 3 ఫూర్తి ఫీచర్లు:

1. ‘JBL Pro Sound’మ్యాజిక్:

సైజ్ చిన్నగా ఉందని అస్సలు అంచనా వేయకండి. దీనిలో జేబీఎస్ సిగ్నేచర్ ప్రో సౌండ్ టెక్నాలజీని వాడారు. పాటల్లోని బేస్ చాలా పంచిగా, వోకల్స్ చాలా క్లియర్ గా వినిపిస్తాయి. రూమ్ లోపల పెట్టినా.. లేదా అవుట్‌డోర్ ట్రిప్స్‌లో ఓపెన్ ప్లేస్‌లో పెట్టినా సరే, దీని సౌండ్ అవుట్‌పుట్ మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది.

2. అల్ట్రా-మోడ్రన్ అండ్ స్టైలిష్ డిజైన్:

Advertisement

JBL Go 3 డిజైన్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఇది సరి కొత్త ఎడ్జీ డిజైన్‌తో, కంటికి నచ్చే ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో వస్తుంది. దీనికి ఒక చిన్న ‘ఇన్-బిల్ట్ లూప్’ ఉంటుంది. దీని వల్ల మీరు నడుస్తున్నప్పుడు చేతికి తగిలించుకోవచ్చు, సైకిల్ హ్యాండిల్‌కి లేదా మీ ట్రావెల్ బ్యాగ్‌కి తగిలించుకుని ఈజీగా తీసుకెళ్లొచ్చు.

3. IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ :

ఈ స్పీకర్ కి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇదే! దీనికి IP67 రేటింగ్ ఉంది. అంటే ఇది పూర్తిగా వాటర్‌ప్రూఫ్ , డస్ట్‌ప్రూఫ్. మీరు పూల్ పార్టీలకు వెళ్లినా, బీచ్‌కి వెళ్లినా, లేదా వర్షంలో తడిసినా సరే ఈ స్పీకర్‌కి ఏమీ కాదు. ఎలాంటి టెన్షన్ లేకుండా రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవచ్చు.

Advertisement

Also Read: జేబులో డబ్బులు మిగలాలి, సౌండ్ అదిరిపోవాలి! రూ.1000లోపు బెస్ట్ బడ్జెట్ సౌండ్‌బార్ ఇదే..

4. సీమ్‌లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ:

దీనిలో లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీని ఇచ్చారు. మీ స్మార్ట్‌ ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌కి చాలా ఫాస్ట్‌గా , ఎలాంటి లాగ్ లేకుండా కనెక్ట్ అయిపోతుంది. వైర్‌లెస్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది.

5. టైప్-సి ఛార్జింగ్ & బ్యాటరీ లైఫ్:

ఈ స్పీకర్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. మీడియం వాల్యూమ్‌లో దాదాపు 5 గంటల వరకు నాన్-స్టాప్ ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. దీనిలో మోడ్రన్ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం వల్ల చాలా స్పీడ్‌గా ఛార్జ్ అవుతుంది.

మీ బడ్జెట్ రూ.2,300 లోపు ఉండి.. బ్రాండెడ్ క్వాలిటీ, అదిరిపోయే బేస్, వాటర్‌ప్రూఫ్ ఫీచర్ ఉన్న బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ కావాలనుకుంటే.. JBL Go 3 కళ్ళు మూసుకుని కొనేయొచ్చు. ముఖ్యంగా ట్రావెలర్స్, కాలేజ్ స్టూడెంట్స్ , వైల్డ్ లైఫ్ క్యాంపింగ్ ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ గాడ్జెట్.

Related News

ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?

9000mAh బ్యాటరీ.. ఏడేళ్ల అప్‌డేట్స్.. 2026లో బెస్ట్ మిడ్‌రేంజ్ ఫోన్ల లిస్ట్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×