Yashasvi Jaiswal On Kl Rahul: టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పై (Kl Rahul ) యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెఎల్ రాహుల్ వెంట ఉంటే టీమిండియా ప్లేయర్లకు రూపాయి ఖర్చు కాదని వ్యాఖ్యానించాడు. అతనితో రెస్టారెంట్, హోటల్ లేదా ఇతర షాపింగ్ ఎక్కడికి వెళ్లినా కేఎల్ రాహుల్ బిల్ కట్టేస్తాడని తెలిపాడు. టీమిండియా జూనియర్ క్రికెటర్లు అందరం విపరీతంగా హోటల్స్ లో తినేస్తామని గుర్తు చేశాడు. ఆ సమయంలో బిల్లు వేలల్లో అవుతుందని వ్యాఖ్యానించాడు.
అయితే ఆ బిల్లును వెంటనే కేఎల్ రాహుల్ తన కార్డు ద్వారా కట్టేస్తాడని వెల్లడించాడు. అందుకే టీమిండియా జూనియర్ క్రికెటర్లు అందరూ కేఎల్ రాహుల్ వెంట వెళుతూ ఉంటామని చెప్పుకొచ్చాడు. అతనితో వెళ్తే ఫుడ్ ఖర్చు మిగులుతుందని తన లాంటి క్రికెటర్లు ఆలోచన చేస్తూ ఉంటారని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ ఒక్కడే కాదు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఉదారత కలిగిన వాళ్లు అంటూ వ్యాఖ్యానించాడు. వాళ్లతో వెళ్ళినప్పుడు కూడా బిల్లులు కట్టేవారని పేర్కొన్నారు. ఈ ముగ్గురు తప్ప, అందరూ పిసినారులేనని సంచలన వ్యాఖ్యానించాడు.
టీమిండియాలో సీనియర్లతో జూనియర్లు కలిసి తినడం సాంప్రదాయంగా వస్తోందని యశస్వి జైస్వాల్ వెల్లడించాడు. మహేంద్ర సింగ్ ధోని నుంచి మొదలుకొని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కెప్టెన్సీలలో టీమిండియా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు… కచ్చితంగా అక్కడ బయట హోటల్లో టీమిండియా ప్లేయర్లు డిన్నర్లు చేసేవారని తెలిపారు. విదేశాల్లో డిన్నర్లు చేసి ప్లేయర్ల మధ్య బాండింగ్ పెంచుకునే వాళ్ళమని వివరించాడు. ఇప్పటికీ ఈ సంస్కృతి కొనసాగుతోందని.. దీనివల్ల సీనియర్లు, జూనియర్లు బాండింగ్ పెరుగుతుందని స్పష్టం చేశాడు.
ఇది ఇలా ఉండగా న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా (IND VS NZ) మధ్య నవంబర్ 4వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ కు స్థానం దక్కలేదు. అతడిని పక్కకు పెట్టిన టీమిండియా యాజమాన్యం.. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ లాంటి యంగ్ క్రికెటర్లను తెరపైకి తీసుకువచ్చింది. దీంతో వన్డే సిరీస్ లో శుభమాన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా దిగే ఛాన్సులు ఉన్నాయి. లేదా రోహిత్ శర్మతో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపెనర్ గా దిగుతారు.