Furqan Bhatti On IND VS PAK: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య మ్యాచ్ లు అంటే జనాలు ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ద్వైపాక్షిక సిరీస్ లు జరిగినప్పుడు ఈ మ్యాచ్ లు ప్రతి నెల జరిగినంటే అనిపించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్స్ లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. రెండేళ్లకు ఒకసారి వచ్చి ఆసియా కప్ సందర్భంగా కూడా పోటీ పడుతున్నాయి. అయితే.. రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో పాకిస్థాన్ పర్యటనకు టీమిండియా వెళ్లడం లేదు.
ఇండియా, పాక్ మ్యాచ్ లపై పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్టు మహ్మద్ పుర్ఖాన్ భట్టి (Furqan Bhatti) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇంకెన్ని రోజులు పాకిస్తాన్ పర్యటనకు రాకుండా ఉంటారు.. ఇప్పటికైనా భారత జట్టు తమ దేశానికి రావాలని కోరాడు. అలా కాదని పాకిస్తాన్ పర్యటనకు టీమిండియా రాకపోతే భారత క్రికెట్ నియంత్రణ మండలి రోడ్డున పడుతుందని హెచ్చరించాడు. పాకిస్తాన్ పర్యటనకు టీమిండియా వస్తే ప్రపంచ వ్యాప్తంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు సిద్ధంగా ఉన్నారని.. ఆ దిశగా బీసీసీఐ ( BCCI) అడుగులు వేయాలని కోరాడు. పాకిస్తాన్ లో టీమిండియా మ్యాచ్ లు ఆడితే, వ్యూయర్ షిప్ విపరీతంగా పెరుగుతుందని చెప్పాడు. దీంతో రెండు బోర్డులకు కోట్ల వర్షం కురుస్తుందని వెల్లడించాడు. దీంతో పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్టు మహ్మద్ పుర్ఖాన్ భట్టి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (IND VS PAK) మధ్య జరిగే మ్యాచ్ లపై పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్టు మహ్మద్ పుర్ఖాన్ భట్టి (Furqan Bhatti) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు భారతదేశానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టు వెళ్లినట్టు గుర్తు చేశాడు. కానీ తమ దేశానికి టీం ఇండియా ఎందుకు రావడంలేదని ప్రశ్నించాడు. ఇంగ్లాండ్ తో పాటు శ్రీలంక లాంటి బలమైన జట్లు పాకిస్తాన్ పర్యటనకు వస్తే, మంచి సెక్యూరిటీ అందించామని వివరించాడు.
టీమిండియా కూడా పాకిస్తాన్ గడ్డపై అడుగు పెడితే, ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండా చూస్తామని హామీ ఇచ్చాడు. ఏ జట్టుకు ఇవ్వలేని సెక్యూరిటీని టీమిండియాకు ఇచ్చే బాధ్యత తమదేనని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి ఆటగాళ్లు ఒక్కసారైనా పాకిస్తాన్ కు వచ్చి క్రికెట్ ఆడుతే చూడాలని చాలా మంది అభిమానులు ఇక్కడ కూడా ఎదురుచూస్తున్నట్టు వ్యాఖ్యానించాడు. కానీ బీసీసీఐ అటు ఐసీసీ జై షా దీన్ని జరగకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యాడు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని.. కచ్చితంగా పాకిస్తాన్ కు టీమిండియా రావాలని కోరాడు.