Jio vs Airtel vs Vodafone Idea : ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఎప్పటికప్పుడు తమ యూజర్స్ కోసం లేటెస్ట్ ప్లాన్స్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అన్లిమిటెడ్ ప్లాన్స్ ఉండగా ఇప్పుడిప్పుడే తమ కస్టమర్స్ ను మరింత ఆకట్టుకోవడానికి డేటా ప్లాన్స్ ను సరికొత్తగా తీసుకొస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఎక్కువగా ఉపయోగించే 2.5జిబి ప్లాన్.. ఈ మూడు టెలికాం సంస్థలో అందిస్తున్నాయి. అయితే వీటిలో బెస్ట్ ప్లాన్ ఏంటి? ఏ టెలికాం సంస్థ బెస్ట్ ప్లాన్ ను అందిస్తుందో చూద్దాం.
ఇండియాలో ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ మధ్య ఎలాంటి పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ప్రీపెయిడ్ ప్లాన్స్ లో ఈ మూడు ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉంటున్నాయి. తమ కస్టమర్స్ కోసం అన్లిమిటెడ్ కాలింగ్స్, అపరిమిత డేటాతో బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ ను తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నో ప్లాన్స్ అందుబాటులో ఉండగా.. 2.5 జిబి డేటా ప్లాన్ సరికొత్తగా వచ్చేసింది. అయితే అసలు ఈ 2.5 జీబి రీఛార్జ్ ప్లాన్ ను ఏ టెలికాం సంస్థ ఎట్లా అందిస్తుంది అనేది ఒకసారి చూద్దాం.
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్‌లు –
రూ. 399 ప్లాన్ – జియో రూ. 399 ప్లాన్ హై ఇంటర్నెట్ ను ఉపయోగించే యూజర్స్ కోసం తీసుకొచ్చిన బెస్ట్ ప్లాన్. అపరిమిత డేటా, అపరిమిత కాలింగ్ కోసం చూసే వినియోగదారుల కోసం ఈ ప్లాన్ తీసుకొచ్చారు. ఈ ప్లాన్ రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 70GB, అలాగే రోజుకు 100 SMSలు. అదనంగా జియో అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తోంది. ఇంకా ఈ ప్లాన్‌లో జియో టీవీ, క్లౌడ్, సినిమాల యాక్సెస్ కూడా ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.
రూ. 429 ప్లాన్ – టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌కు 1 నెల కాలానికి పరిమితం చేసింది. ఈ ప్లాన్ రోజుకు 2.5GB డేటా, 100 SMSలను అందిస్తుంది. ఇతర నెట్‌వర్క్‌లకు కూడా అపరిమిత కాలింగ్‌ను అందిస్తోంది. అలాగే ఈ ప్యాక్ అపరిమిత 5G డేటా, హలో ట్యూన్, ఉచిత టీవీ షోలు, చలనచిత్రాలు, లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అధికారిక యాప్, వెబ్‌సైట్ నుండి రీఛార్జ్ చేసుకోవచ్చు.
రూ. 409 ప్లాన్ – Vodafone Idea ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 100 SMSలతో పాటు రోజుకు 2.5GB డేటాతో వచ్చేసింది. ఇక ఈ ప్లాన్ వినియోగదారులకు కనెక్ట్ అయ్యేలా ప్రయాణంలో సైతం అంతరాయం లేని వినోదాన్ని అందిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందించింది. Binge All Night, Weekend Data Rollover తో పాటు Data Delights సహా అనేక అదనపు సేవలు ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. సో ఇదండీ చూశారుగా ఈ మూడు సంస్థలు అందిస్తున్న 2.5 జీబీ ప్లాన్స్ ఇవే. మరి వీటిలో మీకు కావాల్సిన బెస్ట్ ప్లాన్ ను ఈజీగా ఎంచుకోండి.
ALSO READ : క్రోమ్ లో ఈ 5 సెట్టింగ్స్ తెలుసా! లేదంటే..!