Allu Arjun Case: సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన గురించి ఇప్పటివరకు అల్లు అర్జున్ పలుమార్లు స్పందించాడు. కానీ స్పందించిన ప్రతీసారి ఆయన చెప్పేవి చాలావరకు అబద్ధాలు అని ప్రూవ్ అవుతూ వస్తోంది. తాజాగా ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. అందులో అసలు తాను రోడ్ షో అనేది చేయలేదని, తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం తనకు తరువాతి రోజు వరకు తెలియదని అన్నాడు. ఇప్పుడు మాత్రమే కాదు.. ఇంతకు ముందు కూడా ఇదే మాట అన్నాడు అల్లు అర్జున్. కానీ పోలీసులు చెప్పిన వివరాలు, థియేటర్ నుండి బయటికొచ్చిన ఫుటేజ్ చూస్తుంటే తను అబద్ధం చెప్తున్నాడనే విషయం అర్థమవుతోంది.
రోడ్ షో జరిగింది
‘పుష్ప 2’ ప్రీమియర్ షోను చూడడానికి డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్దకు వచ్చాడు అల్లు అర్జున్. తను అక్కడ రోడ్ షో చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా.. ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుండి రోడ్ షో చేస్తూ వచ్చాడు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ రోడ్ షో వల్ల, అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వస్తున్నట్టు ముందుగానే ప్రకటించడం వల్ల అక్కడ భారీగా ఫ్యాన్స్ చేరుకున్నారు. ఇక తను థియేటర్‌లోకి ఎంటర్ అవ్వగానే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి మరణించిందని తెలియకుండానే అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో థియేటర్ ఫుటేజ్‌లో స్పష్టంగా ఉంది.
Also Read: ‘పుష్ప 2’ హెచ్‌డీ ప్రింట్ లీక్.. యూట్యూబ్‌లోనే మొత్తం..
ఫుటేజ్‌లో ఉంది
రేవతి చనిపోయిందని, తన కుమారుడు శ్రీ తేజ్ సీరియస్‌గా ఉన్నాడనే విషయం చెప్పడానికి థియేటర్‌లో ఉన్న అల్లు అర్జున్ దగ్గరకు పోలీసులు వచ్చారు. కానీ పోలీసులను అల్లు అర్జున్ మ్యానేజర్, బౌన్సర్స్ లోపలికి రానివ్వలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అసలు పోలీసులు తన దగ్గరకు రాలేదని, తనకు ఏమీ చెప్పలేదని అంటున్నాడు. అల్లు అర్జున్‌ను కలవడానికి పోలీసులు ప్రయత్నించిన ఫుటేజ్ తాజాగా బయటికొచ్చింది. దీంతో ఈ హీరో అబద్ధం చెప్పాడనే విషయం బయటపడింది. అంతే కాకుండా అప్పటికప్పుడు అల్లు అర్జున్‌ను పోలీసులు బయటికి తీసుకురావడినికి ప్రయత్నించినట్టుగా కూడా ఈ ఫుటేజ్‌లో కనబడింది.
శ్రీ తేజ్‌ను చూడలేదు
‘పుష్ఫ 2’ ప్రీమియర్స్ ముగిసిన రెండు రోజుల తర్వాత సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై స్పందిస్తూ అల్లు అర్జున్ ఒక వీడియో విడుదల చేశాడు. అందులో కూడా అసలు రేవతి చనిపోయిన విషయం మరుసటి రోజు వరకు తనకు తెలియదని అన్నాడు. ఇప్పటివరకు తొక్కిసలాటలో బ్రెయిన్ డ్యామేజ్ జరగడం వల్ల ఆసుపత్రిపాలైన శ్రీ తేజ్‌ను చూడడానికి కూడా అల్లు అర్జున్ (Allu Arjun) వెళ్లలేదు. అలా తనకు వెళ్లకపోవడానికి ఇప్పటికీ చాలా కారణాలు చెప్పాడు. ఇప్పటివరకు దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్వయంగా వెళ్లి శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి నేరుగా తెలుసుకున్నారు.
థియేటర్‌లో జరిగింది ఇదే… #AlluArjun #Pushpa2ThaRule #SandhyaTheatre #SandhyaTheatreIncident #Sukumar #sandhyatheater #BIGTVCinema @alluarjun @aryasukku pic.twitter.com/cHnjjcMK6x
— BIG TV Cinema (@BigtvCinema) December 22, 2024