Kalvakuntla Kavitha: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయటంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందించారు. విద్యార్థుల ప్రొటెస్ట్ కారణంగానే కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం కేంద్ర మంత్రి రిజైన్ చేస్తే సరిపోదన్నారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. పేపర్ లీకేజీ సంక్షోభాలకు ఇది ఎంత మాత్రం పరిష్కారం కాదన్నారు. కేవలం బీజేపీకి జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకే కేంద్రమంత్రి తో రాజీనామా చేయించారని చెప్పారు.
విద్యార్థులకు నిజంగా న్యాయం జరగాలంటే మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. వ్యవస్థాగత సంస్కరణల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందన్నారు. యూపీఎస్సీ తరహాలోనే ఎన్టీఏకు కూడా చట్టబద్దమైన స్వతంత్రత ఇవ్వాలన్నారు. భవిష్యత్ లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చట్టాలను తీసుకురావాలని కోరారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Also Read: జియో గుడ్ న్యూస్.. రూ. 999 కే 5TB గూగుల్ క్లౌడ్ స్టోరేజ్.. 196 GB డేటా, ఫ్రీ కాల్స్!
ఈనెల 20న విద్యార్థులపై పాశవికంగా పోలీసులు జరిపిన దమనకాండపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాఠీఛార్జ్ కు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. అప్పుడు మాత్రమే విద్యార్థులకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందని చెప్పారు. కేవలం కేంద్రమంత్రితో రాజీనామా చేయించి కంటితుడుపు చర్యలు చేపడతామంటే ఊరుకునేది లేదనిహెచ్చరించారు.
Also Read: తక్కువ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!