E-Paper
Advertisement

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై.. మంత్రి పొన్నం షాకింగ్ కామెంట్స్!

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై.. మంత్రి పొన్నం షాకింగ్ కామెంట్స్!
Advertisement

Ponnam Prabhakar: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన విజయం అని మంత్రి పొన్నం అన్నారు. ఇది ఒక్క వ్యక్తి రాజీనామా కాదు, విద్యార్థి శక్తి ముందు అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భం అని కొనియాడారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేంద్ర బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడానికి తొలి మెట్టు అంటూ
సంచలన వ్యాఖ్యలు చేశారు.

గట్టి సమాధానం..

విద్యార్థుల ఉద్యమం, ప్రతిపక్షాల పోరాటం, ముఖ్యంగా రాహుల్ గాంధీ నిరంతర ఒత్తిడి కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును అణచివేయాలని చేసిన ప్రతి ప్రయత్నానికి ఈ పరిణామం గట్టి సమాధానం అని అన్నారు. విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు, విద్యార్థుల నిరసనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం చివరకు ప్రభుత్వానికే నష్టాన్ని మిగిల్చిందని అన్నారు.

Advertisement

Also read: Rythu Bima: తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. ఆగిపోనున్న రైతు బీమా పథకం!

పెరుగుతున్న వ్యతిరేఖత..

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే దేశ యువత తగిన సమాధానం చెబుతుందని ఈ ఉద్యమం నిరూపించింది. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును హరిస్తే ప్రజలు మరింత ఐక్యంగా పోరాడతారని కేంద్ర ప్రభుత్వం గ్రహించాలని అన్నారు. ఈ రాజీనామా దేశ ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం అని, విద్య, ఉపాధి, యువత భవిష్యత్తు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని పూర్తిగా మార్చుకోవాలని తెలిపారు.

Advertisement

Also read: బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

Related News

ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపిక కాలేదా? మీ డబ్బు ఇలా వాపస్

మట్టి గణపయ్యను ఇంటికి తీసుకెళ్లండి.. హెచ్ఎండీఏ బంపర్ ఆఫర్

రేవంత్ vs కేసీఆర్.. సామాజిక స్పృహపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

మీ అయ్య జాగీరా.. మా MLCలను సస్పెండ్ చేస్తావా? కేటీఆర్ ఫైర్

కోర్టు ఉత్తర్వులంటే అలుసా? ఐఏఎస్‌ల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

తెలంగాణ శాసన మండలిలో షాకింగ్ న్యూస్.. ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు!

ప్రజలే మీ బట్టలు విప్పేశారు.. ఇంకా ఎందుకు ఈ డ్రామా?

బూతులు, బట్టలు విప్పడాలు.. ఇదేం దారుణం..కూనంనేని ఫైర్

Big Stories

Advertisement
×