Gut Health: మన శరీర ఆరోగ్యం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది జీర్ణ ప్రక్రియ. ముఖ్యంగా జీర్ణ క్రియలో పేగుల ఆరోగ్యం(Gut Health) కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కానీ ఇది బరువు, జీర్ణక్రియతో పాటు మొత్తం ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. బరువు తగ్గడానికి (Weight loss) కూడా పేగుల ఆరోగ్యం(Gut Health) ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పేగు మైక్రోబయోమ్:
పేగుల్లో బిలియన్ల కొద్ది బ్యాక్టీరియాలతో పాటు ఇతర సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. వీటిని పేగు మైక్రోబయోమ్ అని పిలుస్తారు. ఈ సూక్ష్మ జీవులు పోషకాలను గ్రహించడానికి అంతే కాకుండా శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా పేగుల్లో మంచి బ్యాక్టీరియా లేకపోవడం లేదా చెడు బ్యాక్టీరియా అధికంగా ఉండటం వల్ల అది జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.
జీర్ణక్రియ, జీవక్రియ:
పేగు ఆరోగ్యం జీవక్రియను నేరుగా ప్రభావితం చేస్తుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉన్నప్పుడు, అవి శరీరం కేలరీలను బాగా గ్రహించడంలో సహాయపడతాయి. దీనికి విరుద్ధంగా బ్యాక్టీరియా సమతుల్యత చెదిరిపోతే శరీరం కేలరీలను సరిగ్గా బర్న్ చేయదు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
హార్మోన్ల సమతుల్యత:
మన శరీరంలోని గ్లూకోజ్ ఇన్సులిన్ , గ్రెలిన్ (ఆకలిని నియంత్రించే) వంటి వివిధ హార్మోన్ల స్థాయిలను పేగు ప్రభావితం చేస్తుంది. పేగు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది ఆకలి పెరగడం లేదా జీవక్రియ మందగించడం వంటి సమస్యలకు దారితీస్తుంది. మంచి పేగు ఆరోగ్యంతో హార్మోన్ల సరైన సమతుల్యత సాధ్యం అవుతుంది. ఇది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బరువు పెరగడం:
ప్రేగులలో మంట పెరిగితే అది శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును పెంచుతుంది. చెడు గట్ బాక్టీరియా , చెడు ఆహారపు అలవాట్లు వాపును పెంచుతాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రోబయోటిక్స్ , ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి పేగులలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
మంచి డైట్:
పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సమతుల్య, పోషకాలు అధికంగా ఉండే ఆహారం అవసరం. కొన్ని రకాల ఆహారాలలో పేగు ఆరోగ్యానికి తోడ్పడే పోషకాహాలు ఉంటాయి.
ప్రోబయోటిక్స్: పెరుగు, కిమ్చి ,పులియబెట్టిన ఆహారాలు వంటివి మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి.
ఫైబర్: తాజా పండ్లు, కూరగాయలు, ఓట్ మీల్ , తృణధాన్యాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు: అవకాడో, అవిసె గింజలు, చియా గింజలు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను తినడం వల్ల పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వ్యాయామం :
శారీరక శ్రమ పేగు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పేగులోని బాక్టీరియా సమతుల్యత ఉంటుంది. ఇది జీవక్రియ మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో మంటను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Also Read: బొప్పాయి ఆకుల రసం తాగితే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే !
ఒత్తిడి:
మానసిక ఒత్తిడి పేగు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది పేగు వాపు ,జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అందుకే మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి , ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, యోగా ,మంచి నిద్ర వంటివి కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి.