E-Paper
Advertisement

ల్యాప్ టాప్ కొనే ఆలోచన ఉందా? ఇప్పుడే..కొనడం బెటర్

ల్యాప్ టాప్ కొనే ఆలోచన ఉందా? ఇప్పుడే..కొనడం బెటర్
Advertisement

Why laptop prices are rising India 2026: ప్రస్తుత డిజిటల్ యుగంలో ల్యాప్‌ టాప్ అనేది కేవలం లగ్జరీ గాడ్జెట్ కాదు, అందరి జీవితంలో ఒక నిత్యవసర వస్తువుగా మారి పోయింది. స్టూడెంట్స్ ఆన్‌లైన్ క్లాసులు వినాలన్నా.. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా ల్యాప్‌టాప్ ఉండాల్సిందే. అయితే.. టెక్ మార్కెట్ నిపుణులు, గ్లోబల్ సప్లై చైన్ నివేదికల ప్రకారం త్వరలోనే లాప్‌టాప్ కొనే వారికి గట్టి షాక్ తగలబోతోంది. రాబోయే కొద్ది నెలల్లో మార్కెట్లో లభించే వివిధ బ్రాండ్ల లాప్‌టాప్ ధరలు సుమారు 35 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇంత భారీగా ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. గ్లోబల్ మార్కెట్‌లో సెమీకండక్టర్లు, చిప్స్‌ కొరత ఏర్పడటమే. అంతే కాకుండా రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడం, గ్లోబల్ ట్యాక్స్‌లు మారడం వంటి అనేక కారణాలు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంపై.. తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రాసెసర్లు, గ్రాఫిక్స్ కార్డ్స్ , డిస్‌ప్లే ప్యానెల్స్ తయారీకి కావలసిన ముడి పదార్థాల ధరలు పెరగడంతో.. కంపెనీలు అనివార్యంగా తమ ప్రొడక్ట్స్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. గేమింగ్ లాప్‌ టాప్స్ నుంచి సాధారణ ఆఫీస్ వర్క్ ల్యాప్‌ టాప్స్ వరకు అన్ని కేటగిరీలలోనూ ఈ ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.

Advertisement

ఉదాహరణకు.. ప్రస్తుతం రూ.40,000 నుంచి రూ.50,000 ధర కలిగిన ఒక మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్‌ టాప్,ధరలు పెరిగిన తర్వాత అదనంగా.. మరో రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఎక్కువ చెల్లించి కొనాల్సి రావచ్చు. మధ్యతరగతి కుటుంబాలకు, విద్యార్థులకు ఇది నిజంగా పెద్ద ఆర్థిక భారంగా మారుతుంది. అందుకే టెక్ నిపుణులు ఒక కీలక సలహా ఇస్తున్నారు. మీకు నిజంగా ల్యాప్ టాప్ అవసరం ఉంటే.. ధరలు ఆకాశాన్నంటక ముందే, అంటే ఈ లోపే కొనడం తెలివైన పని అని సూచిస్తున్నారు.

Also Read: చలికాలంలో ఏసీ కొంటే వేలల్లో డబ్బులు సేవ్! ఎవరూ చెప్పని సీక్రెట్ ట్రిక్ ఇదే!

Advertisement

అయితే.. ముందస్తుగా కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.ఆన్‌ లైన్ సేల్స్, బ్యాంక్ డిస్కౌంట్లు, ఈజీ ఈఎంఐ ఆప్షన్లను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే.. బడ్జెట్‌లో మంచి ల్యాప్‌ టాప్‌ను సొంతం చేసుకోవచ్చు. బ్రాండ్లు అందించే.. ఆఫర్లను గమనిస్తూ, మీ అవసరానికి సరిపోయే ప్రాసెసర్ (i5 లేదా Ryzen 5 వంటివి) ఉన్న మోడల్‌ను ఇప్పుడే ఎంచుకోవడం మంచిది.

ధరలు పెరిగిన తర్వాత బాధపడేకంటే.. ముందే అప్రమత్తమై ప్లాన్ చేసుకోవడం ఎప్పుడూ బెస్ట్. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా కొత్త ల్యాప్‌ టాప్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ చేయండి.

Related News

చీకట్లోనూ కలర్ వీడియో.. పిల్లలు, పెంపుడు జంతువుల నిఘాకు షియోమీ కొత్త 4K కెమెరా!

ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రతి నెలా ఎంత ఖర్చు చేయాలి? తెలివైన బడ్జెట్ సీక్రెట్ ఇదే!

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 500 లోపే 15 ఓటీటీలు.. ఉచిత AI, క్లౌడ్ స్టోరేజ్!

8 రకాల బ్యాక్టీరియా, వైరస్‌లకు 99.9% చెక్.. షియోమీ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రత్యేకతలివే!

ట్రిపుల్ లేజర్‌తో మార్కెట్లోకి వచ్చేసిన 4K ప్రొజెక్టర్.. 6100 ISO ల్యూమెన్స్‌తో అదరగొడుతోంది!

చలికాలంలో ఏసీ కొంటే వేలల్లో డబ్బులు సేవ్! ఎవరూ చెప్పని సీక్రెట్ ట్రిక్ ఇదే!

కోడింగ్ నుంచి ఇల్లు వెతకడం వరకు..ఏఐ చేసే ఈ మ్యాజిక్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×