BigTV English
Advertisement

Shalini Pandey: ధనుష్ తో మూవీ… అర్జున్ రెడ్డి బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్

Shalini Pandey: ధనుష్ తో మూవీ… అర్జున్ రెడ్డి బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్

Shalini Pandey : అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండేకి అస్సలు టైమ్ బాగాలేదు. మొదటి మూవీతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ అమ్మడికి ఇప్పటిదాకా స్టార్ డం రాలేదు. పైగా అవకాశాలు కూడా అరకొరగానే ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కాలం గడిపేస్తోంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే ఆమెకు కోలీవుడ్ నుంచి ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని, అది కూడా ధనుష్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.


ధనుష్ తో షాలినీ పాండే మూవీ

తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే రాయన్ మూవీతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. నటుడిగానూ, దర్శకుడిగానూ కెరీర్‌ ధనుష్ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉందని చెప్పవచ్చు. రాయన్‌ తర్వాత ధనుష్ తన తదుపరి రెండు చిత్రాలతో దర్శకుడిగా బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ధనుష్ తన దర్శకత్వంలో రాబోతున్న నాల్గవ సినిమాకు ఆయన నటీనటులను ఖరారు చేశారని, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాలినీ పాండే కథానాయికగా నటిస్తోందని,  ఇప్పటికే తేనిలో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మొదలైందని తెలుస్తోంది. ధనుష్, సత్యరాజ్, రాజ్‌కిరణ్, అరుణ్ విజయ్, నిత్యా మీనన్, షాలిని పాండే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఆకాష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, షాలిని ఇన్వాల్వ్‌మెంట్ వార్త ఆమె అభిమానులతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచింది.


అయితే షాలినీ పాండేకి కోలీవుడ్ లో ఇదే మొదటి చిత్రం కాదు. 100% కాదల్‌తో షాలినీ పాండే తమిళంలోకి అడుగు పెట్టింది. అయితే మరో సినిమా చేతుల్లో ఉండగానే ఆమె హిందీ సినిమాకు సైన్ చేయడంతో అది ఆగిపోయింది. దీంతో ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు రాలేదు. కనీసం హిందీలో అయినా ఫేమ్ దక్కిందా? అంటే అదికూడా లేదు. అనేక హిందీ చిత్రాలలో నటించినప్పటికీ షాలిని అక్కడ చెప్పుకోదగ్గ పాపులారిటీని సంపాదించుకోలేదు. ఇక ఇప్పుడు ధనుష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ఆమె తమిళ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది అనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలు గనుక నిజమైతే షాలినీ పాండేకి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. మరి ఈ వార్తలు గనుక నిజమైతే ఇప్పటికైనా షాలిని కోలీవుడ్ చిత్ర సీమలో నిలదొక్కుకుంటుందా? అనేది చూడాలి.

ధనుష్ పై ఎత్తేసిన బ్యాన్

శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్‌తో ఆర్థిక వివాదాల కారణంగా ధనుష్ పై ఆగస్టులో తమిళ చిత్ర నిర్మాతల మండలి (TPFC) నుండి తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అయితే ధనుష్, కౌన్సిల్ సభ్యుల మధ్య రీసెంట్ గా జరిగిన సమావేశం తరువాత ఆ బ్యాన్ ను ఎత్తేశారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×