E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Shoaib Akhtar: మ‌రో 5-7 ఏళ్ల పాటు టీమిండియాను పాకిస్తాన్ ఓడించ‌డం క‌ష్ట‌మే

Shoaib Akhtar: మ‌రో 5-7 ఏళ్ల పాటు టీమిండియాను పాకిస్తాన్ ఓడించ‌డం క‌ష్ట‌మే
Advertisement

Shoaib Akhtar :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)  చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ టోర్నమెంటును చిన్నచూపు చూస్తూ… షాకింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు దీనిపై స్పందించగా… తాజాగా మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్… నేపథ్యంలో టీమిండియా కు టాలెంటెడ్ ప్లేయర్లు దొరుకుతున్నారని వ్యాఖ్యానించారు. దానివల్ల టీమిండియా మరింత బలంగా తయారవుతోందని వెల్లడించారు షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar). ఈ నేపథ్యంలో మరో ఐదు నుంచి ఏడు సంవత్సరాల పాటు టీమిండియాను ఓడించడం ఎవరితరం కాదని హెచ్చరించారు. ముఖ్యంగా టీమిండియాను పాకిస్తాన్ ఓడించడం చాలా కష్టమని కుండబద్దలు కొట్టి చెప్పారు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

టీమిండియాను ఓడించడం ఎవరి తరం కాదు.. షోయబ్ అక్తర్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)   కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లా మీద ఒట్టేసి చెబుతున్నా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అనేది టాలెంటెడ్ ప్లేయర్ల కోసం మాత్రమే నిర్వహిస్తున్నారని వెల్లడించారు. దీనివల్ల టీం ఇండియాకు వందకు రెండు వందల శాతం లాభం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ఐపీఎల్ కారణంగా హార్దిక్ పాండ్యా ( Hardik Pandya), సంజు శాంసన్ ( Sanju Samson), అభిషేక్ శర్మ ( Abhishek Sharma), ఇషాన్ కిషన్ ( Ishan Kishan ), గుజరాత్ కెప్టెన్ శుభమాన్ గిల్ ( Gill) లాంటి ఫైటర్స్ టీమ్ ఇండియాకు లభించారని గుర్తు చేశారు. ఈ అందరూ యంగ్ స్టార్స్ టీమిండియాలోకి వచ్చిన నేపథ్యంలో ఆ జట్టు మరింత బలంగా తయారైందని ప్రశంసించారు. ఇలా బలంగా ఉన్న టీమిండియాను ఓడించడం పాకిస్తాన్ జట్టు వల్ల కాదని తేల్చి చెప్పారు. అయితే టీమిండియా ( Team India) ఆలోచన చేసినట్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎక్కడ కూడా ముందుకు సాగడం లేదని చురకలు అంటించారు.

వైభవ్ సూర్యవంశీ పై అనుమానాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటును ( Indian Premier League 2026 Tournament)   మెచ్చుకున్న షోయబ్ అక్తర్… 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ పై మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. అతని వయసు 15 సంవత్సరాలు కాదని.. అంతకుమించి ఉంటుందని బాంబు పేల్చారు. దీనిపై కచ్చితంగా విచారణ చేయాలని ఐసీసీ ని కోరారు షోయబ్ అక్తర్.

Advertisement

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

 

https://www.facebook.com/photo/?fbid=989088494031893&set=a.808612632079481

Related News

యువతితో సహజీవనం, ప్రెగ్నెంట్ అయ్యాక హ్యాండ్.. ఐపీఎల్ ప్లేయ‌ర్ అరెస్ట్ ?

పాకిస్తాన్ క్రికెట్ ను గాడిలో పెట్టేందుకు త్రిముఖ వ్యూహాం..అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

ఓడిపోయామ‌న్న సిగ్గులేకుండా, పందుల్లా తింటున్నారు..మ‌హిళా క్రికెట‌ర్ల‌పై ఇంజ‌మామ్ సీరియ‌స్‌

Sunil Gavaskar: ఎవ‌డికి ప‌డితే, వాళ్ల‌కు ‘ఇండియా క్యాప్’ అస్స‌లు ఇవ్వొద్దు

బౌలర్లు భ‌య‌ప‌డుతున్నారు..వైభ‌వ్ ను క‌ట్ట‌డి చేసేందుకు ఐసీసీ కొత్త రూల్స్ పెట్టాలి

Asghar Afghan: బాబర్ ఆజం కంటే గుర్బాజ్ 1000 రెట్లు బెస్ట్ ప్లేయ‌ర్, మా వాడిది కోహ్లీ రేంజ్

Tanveer Ahmed: వైభ‌వ్ ఒక్క‌సారి ఫామ్ కోల్పోతే, కంబ్యాక్ ఇవ్వ‌డం క‌ష్టం

మ‌రో వివాదంలో అశ్విన్‌…పాకిస్తాన్ ప్లేయ‌ర్ ప‌క్క‌న కూర్చోని ఫోటోలు

Big Stories

×