E-Paper
Advertisement

100% ఛార్జ్ చేయడం ఫోన్‌కు డేంజరా.. టెక్ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

100% ఛార్జ్ చేయడం ఫోన్‌కు డేంజరా.. టెక్ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
Advertisement

Phone Charging Hacks: ఫోన్‌ బ్యాటరీ 100 శాతం నుంచి ఒక్కసారిగా 20 శాతానికి పడిపోయినప్పుడు వచ్చే టెన్షన్‌ అంతా ఇంతా కాదు. కొత్తగా ఫోన్ కొన్నప్పుడు రోజంతా వచ్చిన బ్యాటరీ.. కొంతకాలం గడిచాక మాత్రం పదే పదే ఛార్జర్‌ కోసం వెతికేలా చేస్తుంది. అయితే ఫోన్‌ వాడే విధానంలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే బ్యాటరీ పనితీరును ఎక్కువ కాలం మెరుగ్గా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఛార్జింగ్‌ విషయంలో మనం చేసే కొన్ని సాధారణ తప్పులను తగ్గిస్తే బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ప్రతిసారీ 100 శాతం అక్కర్లేదు..

ఫోన్ బ్యాటరీని ప్రతిసారీ 100%కి ఛార్జ్ చేయడం వల్ల దానిపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడూ 80% వరకు ఛార్జ్ చేసుకోవడం మంచి పద్ధతి. ప్రస్తుతం వస్తున్న కొత్త ఫోన్లలో ఛార్జింగ్ లిమిట్ పెట్టుకునే ఆప్షన్లు కూడా ఉంటున్నాయి. ఇవి బ్యాటరీ ఆయుష్షును పెంచడంలో బాగా సహాయపడతాయి.

పూర్తిగా డ్రైన్ అవ్వకుండా చూడాలి..

Advertisement

ఫోన్ ఛార్జింగ్ జీరోకు పడిపోయే వరకు వాడటం మంచిది కాదు. బ్యాటరీ పూర్తిగా ఖాళీ అవ్వడం వల్ల ఫోన్ లైఫ్‌పై ప్రభావం పడుతుంది. అందుకే ఛార్జింగ్ 20%కి రాగానే ప్లగ్‌ఇన్ చేయడం అలవాటు చేసుకోండి. సాధారణంగా 20% నుంచి 80% మధ్యలో ఛార్జింగ్ ఉండేలా చూసుకుంటే బ్యాటరీ చాలా కాలం బాగా పనిచేస్తుంది.

Also Read: బడ్జెట్ ధరలో CMF కొత్త ఇయర్‌బడ్స్.. అదిరిపోయే ఫీచర్లు, ఏకంగా 52 గంటల బ్యాటరీ లైఫ్!

క్వాలిటీ ఛార్జర్ వాడటం ఉత్తమం..

Advertisement

నాణ్యత లేని లోకల్ ఛార్జర్లు, పాడైపోయిన కేబుల్స్ వాడటం వల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. అలాగే కరెంట్ సరఫరా సరిగ్గా ఉండదు. వీలైనంత వరకు మీ ఫోన్‌తో పాటు వచ్చిన ఒరిజినల్ ఛార్జర్ లేదా మంచి బ్రాండెడ్ ఛార్జర్లనే వాడటం సురక్షితం. ఇది బ్యాటరీని పాడవకుండా కాపాడుతుంది.

వేడి ప్రదేశంలో ఉంచొద్దు..

ఫోన్ బ్యాటరీకి అతిపెద్ద శత్రువు వేడి. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్‌ను దిండు కింద, మందపాటి కవర్లలో లేదా ఎండ తగిలే ప్రదేశాల్లో ఉంచకూడదు. ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు బాగా వేడెక్కినట్లు అనిపిస్తే.. కాసేపు బ్యాక్ కవర్ తీసి గాలి తగిలే చల్లటి ప్రదేశంలో ఉంచడం మంచిది.

ఛార్జ్ చేస్తూ ఫోన్ వాడొద్దు..

ఫోన్ ఛార్జింగ్ అవుతున్న సమయంలో గేమ్స్ ఆడటం లేదా పెద్ద యాప్స్ వాడటం వల్ల ఫోన్‌లో ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. చిన్న చిన్న పనులు లేదా మెసేజ్‌లు చూసుకోవడం పర్వాలేదు కానీ, ఎక్కువ సేపు రక రకాల యాప్స్ వాడటం వల్ల బ్యాటరీపై భారం పడుతుంది.

బ్యాటరీ సేవింగ్ ఫీచర్లు వాడాలి..

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్, అడాప్టివ్ ఛార్జింగ్ వంటి ప్రత్యేక ఆప్షన్లు ఉంటాయి. ఇవి ఛార్జింగ్ వేగాన్ని నియంత్రిస్తూ బ్యాటరీ పాడవకుండా చూస్తాయి. అలాగే రాత్రిపూట ఛార్జింగ్ పెట్టి పడుకునే అలవాటు ఉన్నవారు ఈ ఫీచర్లను ఆన్ చేసుకుంటే ఫోన్ రాత్రంతా 100 శాతం ఛార్జింగ్ నిండినా సురక్షితంగా ఉంటుంది.

Also Read: షావోమి ఫోన్లలో ఐఫోన్ తరహా గ్లాస్ డిజైన్.. మీ మోడల్ ఉందో లేదో చెక్ చేసుకోండి!

Tags

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×