E-Paper
Advertisement

అగ్నిపరీక్షలో జరిగేది ఇదే.. అసలు నిజం బయటపెట్టిన లేడీ కంటెస్టెంట్!

అగ్నిపరీక్షలో జరిగేది ఇదే.. అసలు నిజం బయటపెట్టిన లేడీ కంటెస్టెంట్!
Advertisement

Agni Pariksha2:బిగ్ బాస్ తెలుగు.. సీజన్ 10 కి సిద్ధమవుతున్న వేళ కామన్ మ్యాన్ క్యాటగిరిలో సామాన్యులను హౌస్ లోకి పంపించడానికి ‘అగ్నిపరీక్ష’ అంటూ ఒక షో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 9వ సీజన్ సీజన్ కోసం ఏర్పాటు చేసిన ఈ షో బాగా వైరల్ అవ్వడంతో పదవ సీజన్ కి కూడా అగ్ని పరీక్షా సీజన్ 2 ని ప్రారంభించారు. ఇందులో సామాన్యుల నుంచి స్వీకరించిన దరఖాస్తులలో కొంతమందిని ఫిల్టర్ చేసి అందులో పెర్ఫార్మన్స్ కనబరిచి , హౌస్ లో ఉండగలరన్న నమ్మకం కలిగించిన వారిని హౌస్ లోకి పంపిస్తారన్న విషయం తెలిసిందే. ఇక ఈసారి కూడా ఏకంగా 25 వేలకు పైగా దరఖాస్తులు రాగా.. అందులో 70 మందిని ఎంపిక చేశారు. పలు టెస్ట్ల తర్వాత మొత్తం 15 మంది తేలారు. ఆ 15 మందిలో ఆరుగురిని మాత్రమే హౌస్ లోకి పంపించబోతున్నట్లు సమాచారం.

అగ్నిపరీక్షలో నిజంగానే ఇలా జరుగుతోందా?

ఇకపోతే అగ్నిపరీక్ష సీజన్ 2లో పాల్గొని ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినవాళ్లు పలు ఇంటర్వ్యూలలో షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు తమ ఛానల్ ద్వారా అసలు విషయాలను బయటపెడుతున్నారు. ఇప్పటికే యూట్యూబర్ ఉప్పల్ బాలు (Uppal Balu) బయటకు వచ్చి సంచలన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. జడ్జిలుగా ఉన్న బిందు మాధవి (Bindhu madhavi), నవదీప్(Navdeep ) తనను అవమానించారని, ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ఇక నిన్నటికి నిన్న మరో వ్యక్తి బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఒక స్వయంవరంలా మారిపోయిందని, అమ్మాయిలు వస్తే వారికి ఫేవర్ గా మాట్లాడుతున్నారని, అబ్బాయిలు వస్తే వారి గురించి తెలుసుకోకుండానే పంపించేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఫేవరిజంపై అసలు నిజం బయటపెట్టిన లేడీ కంటెస్టెంట్..

Advertisement

అయితే ఇప్పుడు మరో లేడీ కాంటెస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి చేసిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఎవరో కాదు బెబ్జాన్.. అగ్నిపరీక్ష సీజన్ 2 లో పాల్గొని బయటకు వచ్చిన ఈమె అక్కడ జరిగే విషయాలను బయటపెట్టింది. కొంతమందికి డబ్బులు ఇస్తే ఆఫర్లు ఇస్తారని వస్తున్న నకిలీ కాల్స్ గురించి ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ “అలాంటి కాల్స్ ఏవి నాకు రాలేదు.. బహుశా అవన్నీ అవాస్తవం అయి ఉండొచ్చు” అంటూ ఖండించింది. షో లో ఫేవరిజం జరుగుతోందా? అన్న ప్రశ్నకు కూడా ఆమె మాట్లాడుతూ..” షో నిజంగా జెన్యూన్ గా జరుగుతోంది.. ఎవరు ఎవరిమీద సింపతీ గానీ, పక్షపాతం కానీ చూపించడం లేదు. వారు పెట్టుకున్న రూల్స్ కి కంటెస్టెంట్స్ మ్యాచ్ అవుతున్నారా లేదా అని మాత్రమే చూస్తున్నారు” అంటూ సమాధానమిచ్చింది.

also read:ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ నెల సంపాదన ఎంతంటే?

మ్యాచ్ అయితేనే ఎంపిక..

Advertisement

జడ్జిలు టైం ఇవ్వకుండా కొందరిని పంపించారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ సమాధానం ఏమిటి అని ప్రశ్నించగా జడ్జెస్ కి ఒక వైబ్ ఉంటుంది . ఆ వైబ్ మ్యాచ్ అయితేనే వారు వారికి సమయం ఇస్తారు. కేవలం వ్యక్తిగతం మాత్రమే.. వాళ్లకు ఇచ్చిన రూల్స్ ప్రకారమే ఎంపిక జరుగుతోంది. ఆ రూల్స్ కి తగ్గట్టుగా ఎవరైతే పర్ఫామెన్స్ చేస్తారో వాళ్లనే వాళ్ళు తీసుకుంటారు కదా అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది . మొత్తానికైతే కొంతమంది అగ్ని పరీక్ష పై చేస్తున్న కామెంట్లు అన్నీ ఫేక్ అని, అక్కడ జెన్యూన్ గానే ఎంపిక జరుగుతోంది అంటూ బెబ్జాన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Karthika Deepam 2 Serial Today Episode October 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్న దీప              

Big Stories

Advertisement
×