E-Paper
Advertisement

ఇంట్లోనే స్టేడియం లాంటి మజా.. క్రికెట్ లవర్స్ కోసం LG తెచ్చిన స్పెషల్ TV!

ఇంట్లోనే స్టేడియం లాంటి మజా.. క్రికెట్ లవర్స్ కోసం LG తెచ్చిన స్పెషల్ TV!
Advertisement

LG QNED Mini LED TV: ఇంటిని అందంగా, వెలుతురు వచ్చేలా డిజైన్ చేసుకోవడం ఈ రోజుల్లో ఒక ట్రెండ్. పెద్ద పెద్ద కిటికీల గుండా వచ్చే ఎండ రూమ్‌కి కొత్త అందాన్ని ఇస్తుంది కానీ, అదే సమయంలో టీవీ చూసేటప్పుడు మాత్రం పెద్ద సమస్యగా మారుతుంది. స్క్రీన్‌పై వెలుతురు పడి బొమ్మ సరిగ్గా కనిపించదు. ఈ సమస్యకు పరిష్కారంగానే ఎల్‌జీ సరికొత్త టెక్నాలజీతో క్యూఎన్‌ఈడీ మినీ ఎల్‌ఈడీ టీవీని మన ముందుకు తెచ్చింది.

కాంతిని శాసించే చిన్న ఎల్‌ఈడీలు:

సాధారణ టీవీల్లో వెనుక వైపు ఉండే లైట్లు పెద్దవిగా ఉండటం వల్ల చీకటి సీన్లలో కూడా వెలుతురు పక్కకు వ్యాపించి, నలుపు రంగు కాస్త బూడిద రంగులా కనిపిస్తుంది. కానీ ఈ కొత్త టీవీలో వేలాది సూక్ష్మమైన మినీ ఎల్‌ఈడీలను ఉపయోగించారు. ఇవి ఎక్కడ చీకటి ఉండాలో అక్కడ లైట్‌ను పూర్తిగా బంద్ చేస్తాయి. ఎక్కడ వెలుతురు ఉండాలో అక్కడ మాత్రమే ప్రకాశిస్తాయి. దీనివల్ల స్పేస్ డాక్యుమెంటరీలు లేదా థ్రిల్లర్ సినిమాలు చూసేటప్పుడు ప్రతీ విజువల్ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

Also Read: గోడలపై తేమకు కారణం లీకేజీనా? కండెన్సేషనా? అల్యూమినియం ఫాయిల్‌తో ఇలా కనిపెట్టండి!

ఎండలోనూ చెదరని రంగులు:

బయట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు టీవీ బ్రైట్‌నెస్ పెంచితే రంగులు వెలిసిపోయినట్లు కావడం సహజం. కానీ ఇందులో ఉన్న క్యూఎన్‌ఈడీ కలర్ లేయర్ వల్ల బ్రైట్‌నెస్ ఎంత పెంచినా రంగుల నాణ్యత అస్సలు తగ్గదు. వంద శాతం ఒరిజినల్ రంగులను ఇది స్క్రీన్‌పై చూపిస్తుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ నాణ్యతా సంస్థ ఇంటర్‌టెక్ కూడా ధృవీకరించింది. కాబట్టి.. పగటిపూట గదిలోకి ఎంత వెలుతురు వచ్చినా మీరు కిటికీ తెరలు వేయాల్సిన అవసరం లేకుండానే స్పష్టమైన విజువల్స్ ఆస్వాదించవచ్చు.

ఇంట్లోనే స్టేడియం ఫీలింగ్:

Advertisement

ఇంట్లో కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే స్టేడియంలో ఉన్న అనుభూతిని కలిగించడానికి ఈ టీవీలో ప్రత్యేకంగా ‘క్రికెట్ మోడ్’ ఇచ్చారు. ఇది మ్యాచ్ జరుగుతున్నప్పుడు కెమెరా వేగంగా కదిలినా.. బంతి ఎంత స్పీడ్‌గా వెళ్లినా బ్లర్ కాకుండా చూపిస్తుంది. పైగా స్టేడియం అరుపులను రియలిస్టిక్‌గా వినిపిస్తుంది. 115 ఇంచుల వరకు లభించే ఈ పెద్ద స్క్రీన్‌పై మ్యాచ్ చూస్తుంటే ఇంట్లోనే పండగ వాతావరణం కనిపిస్తుంది.

సినిమా థియేటర్ అనుభూతి:

సినిమా ప్రియుల కోసం ఇందులో డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ టెక్నాలజీలను జోడించారు. ఇవి సినిమా డైరెక్టర్ ఏ రంగులనైతే చూపించాలనుకున్నారో వాటిని అలాగే అందిస్తూ.. శబ్దాలను 360 డిగ్రీల్లో మన చుట్టూ వినిపిస్తాయి. దీంతోపాటు ఉన్న ‘ఫిలింమేకర్ అంబియంట్ మోడ్’ గదిలోని వెలుతురును బట్టి స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. ఎవరైనా పక్కన లైట్ ఆన్ చేసినా మీ సినిమా వీక్షణకు ఎలాంటి అడ్డుపడదు. ఈ సరికొత్త టెక్నాలజీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా.. టీవీ చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది.

Also Read: రూ.5000 డిస్కౌంట్‌తో Xiaomi 17T.. భారీ బ్యాటరీ, లైకా కెమెరాలతో అదరగొడుతోంది!

Related News

పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్

రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

అంతరిక్షంలో అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

Big Stories

Advertisement
×