E-Paper
Advertisement

వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కుల పంపిణీ.. ప్రారంభ తేదీ ప్రకటించిన సీఎం చంద్రబాబు!

వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కుల పంపిణీ.. ప్రారంభ తేదీ ప్రకటించిన సీఎం చంద్రబాబు!
Advertisement

Veligonda Project: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 250 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ డ్రింకింగ్ , సాగునీటి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి.. ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు వల్ల ఇల్లు, స్థలాలు కోల్పోయిన కుటుంబాలకు పునరావాసం కల్పించడంతో పాటు ఆర్థికంగా చేయూత అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

30 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఈ నెల 31న తొలిదశ ప్రారంభం

Advertisement

అసాధ్యమనుకున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసి చూపించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 1996లో తానే ఈ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశానని, ఇప్పుడు ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత రెండేళ్ల కాలంలోనే రూ. 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను పరుగులు తీయించామని తెలిపారు. ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను అధికారికంగా ప్రారంభించి, ఆ ప్రాంత రైతుల దశాబ్దాల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నట్లు ప్రకటించారు.

దుర్భిక్ష పరిస్థితులు.. నదుల అనుసంధానం

Advertisement

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో 50 శాతం లోటు వర్షపాతం నమోదైందని, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని సీఎం గుర్తుచేశారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పోలవరం పూర్తి చేసి కృష్ణా డెల్టాను స్థిరీకరిస్తే, శ్రీశైలంలో ఆదా అయ్యే నీటిని ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప , రాయలసీమ జిల్లాలకు మళ్లించవచ్చని తెలిపారు. జాతీయ స్థాయిలో గంగా-గోదావరి-కావేరి సహా ఐదు నదులను అనుసంధానిస్తే దేశంలో నీటి భద్రత లభిస్తుందని సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.

అభివృద్ధి పథంలో మార్కాపురం..

ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపిన ముఖ్యమంత్రి, మార్కాపురం జిల్లా పరిధిలోని ప్రతి ఇంటికీ జల్ జీవన్ మిషన్ ద్వారా టాప్ కనెక్షన్ ఇచ్చి సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు. దీనికి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సెప్టెంబరులో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేస్తూనే, సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేస్తున్నామని, ప్రజానుకూల ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.

Also Read: జార్ఖండ్ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. టర్బైన్ పేలి ముగ్గురు ఇంజనీర్లు మృతి!

Tags

Related News

ద్వారకా తిరుమలలో మహిళా ఉద్యోగిపై.. సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు!

బీసీలపై ఎందుకంత కక్ష?.. ఢిల్లీ వేదికగా వైసీపీ తీరుపై మండిపడ్డ రామ్మోహన్ నాయుడు!

బీసీ రిజర్వేషన్ల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమన్నారంటే?

ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!

ఏపీలో పాకిస్థాన్ గూఢచారి నెట్‌‌వర్క్ కలకలం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు!

ఆ విధంగా ముందు.. చంద్రబాబు-పవన్ రెండుగంటలపాటు భేటీ, మరోసారి కూర్చోవాలని నిర్ణయం

వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షలు స్వాహా.. కేటుగాడు అరెస్ట్!

Big Stories

Advertisement
×