E-Paper
Advertisement

రూ.25 లక్షల లోపు బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్, ఫీచర్లు అదుర్స్!

రూ.25 లక్షల లోపు బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్, ఫీచర్లు అదుర్స్!
Advertisement

Best Family EVs in India: కుటుంబంతో కలిసి ప్రయాణించేందుకు మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ.25 లక్షల లోపు ఉందా? అయితే, ఈ ధరలోనే  మంచి రేంజ్, అధునాతన ఫీచర్లు, సౌకర్యవంతమైన క్యాబిన్‌తో ఫ్యామిలీ అవసరాలకు సరిపోయే కార్లు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ.25 లక్షల లోపు పరిశీలించే  నాలుగు ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.

1.టాటా సియెర్రా ఈవీ- ధర: రూ.24.79 లక్షలు

టాటా మోటార్స్‌ కు చెందిన సియెర్రా ఈవీ ఈ లిస్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో 75kWh లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనికి 207bhp పవర్, 315Nm టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ ను యాడ్ చేశారు. ఈ వేరియంట్‌ లో రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అందించారు. ఫీచర్ల విషయానికి వస్తే.. 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, AR హెడ్‌ అప్ డిస్‌ ప్లే, 540 డిగ్రీల పనోరమిక్ వ్యూ, ఆటో పార్కింగ్, వెంటిలేటెడ్ సీట్లు, లెవల్ 2 ADAS లాంటి సదుపాయాలు ఉన్నాయి. ఫ్యామిలీతో సౌకర్యవంతమైన ప్రయాణాలకు ఇది మంచి ఆప్షన్‌గా నిలవనుంది.

2.ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ- ధర: రూ.24.25 లక్షలు

Advertisement

మూడు వరుసల సీటింగ్ సౌకర్యం కోరుకునే కుటుంబాలకు ఈ ఎలక్ట్రిక్ SUV ఉపయోగపడుతుంది. ఇందులో 69kWh బ్యాటరీ ప్యాక్, 201bhp పవర్, 310Nm టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని కంపెనీ వెల్లడించింది. 7.4kW AC, 90kW DC ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, 8.8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెదరెట్ సీట్లు, మూడు వరుసలకూ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.

3.కియా కేరెన్స్ క్లావిస్ ఈవీ-ధర: రూ.25 లక్షలు

ఫ్యామిలీ ప్రయాణాలకు అనువైన మరో ఎలక్ట్రిక్ కారు కియా కేరెన్స్ క్లావిస్ ఈవీ. ఇందులో 51.4kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు 169bhp పవర్, 255Nm టార్క్ ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది. డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ ఆడియో సిస్టమ్, లెవల్ 2 ADAS, వైర్‌లెస్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో NMC బ్యాటరీని ఉపయోగించారు.

4.విన్‌ఫాస్ట్ VF MPV 7- ధర: రూ.20.39 లక్షలు

Advertisement

ఈ లిస్టులో తక్కువ ధరలో లభించే మరో క్రేజీ మోడల్ విన్‌ఫాస్ట్ VF MPV 7. ఇటీవల ఈ కారుపై రూ.4.10 లక్షల ధర తగ్గింపు ప్రకటించడంతో ధర రూ.20.39 లక్షలకు చేరింది. ఇందులో 60.13kWh బ్యాటరీ ప్యాక్, 201bhp పవర్, 280Nm టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. పెద్ద కుటుంబాలకు బాగా అనుకూలంగా ఉంటుంది ఈ MPV.

Read Also: టాటా To ఎంజీ.. తక్కువ ధరలో అదిరిపోయే రేంజ్ ఇచ్చే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

Tags

Related News

అమ్మకాల్లో దూసుకెళ్తున్న BGauss.. ఏకంగా లక్ష యూనిట్ల సేల్ క్రాస్!

ఒకేసారి స్కూటర్, బైక్‌కు పేటెంట్లు.. విన్‌ఫాస్ట్ ప్లాన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

చేతక్, ఏథర్‌కు పోటీగా వెస్పా ఈవీలు.. మూడు మోడళ్లలో ఏది బెస్ట్?

హీరోను దాటేసిన హోండా.. టూవీలర్ మార్కెట్లో బిగ్ ట్విస్ట్!

SUV అమ్మకాల్లో మహీంద్రా దూకుడు.. 10 నెలల్లోనే 6.15 లక్షలు దాటిన సేల్స్!

130 కి.మీ వేగం.. 320 కి.మీ ప్రయాణం.. దేశంలోనే లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? 300 కి.మీ రేంజ్ ఇచ్చే సూపర్ మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×