Lumio Arc 7 2026 projector: ప్రస్తుత రోజుల్లో ఇళ్లలోనే కూర్చుని పెద్ద స్క్రీన్‌పై సినిమాలు చూసేందుకు ఉపయోగించే స్మార్ట్ ప్రొజెక్టర్లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ బ్రాండ్ ‘లుమియో’ మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ లుమియో ఆర్క్ 7 (2026) మోడల్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇది గతంలో వచ్చిన మోడళ్లకు పూర్తిగా అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా వస్తోంది. హోమ్ సినిమా లవర్స్ కోసం కంపెనీ దీన్ని ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేసింది. బడ్జెట్ ధరలో ఈ మోడల్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇంతకీ దీనిలోని ప్రత్యేకమైన ఫీచర్లు ఏంటీ ? అంతే కాకుండా ధరకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కొత్త ప్రొజెక్టర్ మెయిన్ హైలైట్ దీని స్క్రీన్ సైజ్ అని చెప్పొచ్చు. లుమియో ఆర్క్ 7 మోడల్ గరిష్టంగా 120 ఇంచుల వరకు పెద్ద స్క్రీన్‌పై అద్భుతమైన విజువల్స్‌ను ప్రొజెక్ట్ చేయగలదు. పెద్ద రూమ్స్ ఉండి స్పోర్ట్స్, సినిమా చూసే వారికి ఇది థియేటర్ ఫీలింగ్‌ను అందిస్తుంది. దీని నేటివ్ రిజల్యూషన్ 1080p ఫుల్ హెచ్‌డీగా ఉంది.
ఈ డివైజ్‌లో కంపెనీ సరి కొత్త ఆర్క్‌లైట్ ఇంజిన్ ను వాడింది. దీని వల్ల ఇది 500 ANSI ల్యూమెన్స్ బ్రైట్ నెస్‌ను అందిస్తుంది. ఇది మునుపటి జనరేషన్ కంటే.. దాదాపు 25% ఎక్కువ బ్రైట్ నెస్ కలిగి ఉండటమే కాకుండా.. గదిలో తక్కువ వెలుతురు ఉన్నప్పటికీ క్లియర్ అయిన పిక్చర్ క్వాలిటీని ఇస్తుంది. అలాగే.. దీని 1700:1 కాంట్రాస్ట్ రేషియో పిక్చర్స్ మరింత రిచ్‌గా చూపుతుంది. దీని పూర్తిగా సీల్డ్ అయిన డస్ట్-ప్రూఫ్ సిస్టమ్ వల్ల లెన్స్ లోపలికి దుమ్ము చేరకుండా ఉంటుంది.
సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ Android 14 ఆధారిత Google TV పై రన్ అవుతుంది. ఇందులో అధికారిక నెటిఫ్లిక్స్ సర్టిఫికేషన్ ఉండటంతో పాటు ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి వేలాది యాప్స్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో సరికొత్త జెమిని ఆన్ గూగుల్ టీవీ ఏఐ అసిస్టెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది. దీని ద్వారా మీరు వాయిస్ కమాండ్స్‌తో మీకు నచ్చిన కంటెంట్‌ను ఇన్‌స్టంట్‌గా సెర్చ్ చేసుకోవచ్చు.
పాత మోడళ్లతో పోలిస్తే.. ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్‌ను రెట్టింపు చేశారు. ఈ కొత్త ప్రొజెక్టర్‌లో 32GB స్టోరేజ్ లభిస్తుంది. తద్వారా మీరు ఎలాంటి మెమరీ ఇబ్బంది లేకుండా.. ఎక్కువ యాప్స్, ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇక సౌండ్ విషయానికి వస్తే, ఇందులో ఉన్న 16W స్టీరియో స్పీకర్లు (డాల్బీ ఆడియో సపోర్ట్‌తో) థియేటర్ వంటి మ్యూజిక్ ఫీల్ ఇస్తాయి. దీన్ని మీరు నార్మల్ బ్లూటూత్ స్పీకర్‌లా కూడా వాడుకోవచ్చు.
Also Read: మీ ఫోన్‌లో ఫోటోలు ముందులా రావట్లేదా? కెమెరా క్వాలిటీ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!
ఇందులో HDMI 2.0 (ARC), USB 2.0, బ్లూటూత్ 5.1, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై వంటి పూర్తి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. దీంతో పాటు ఆటో కీ స్టోన్ కరెక్షన్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇండయన్ మార్కెట్లో ఈ లుమియో ఆర్క్ 7 ప్రొజెక్టర్ ధర రూ.34,999 గా ఉంది. అయితే.. లాంచ్ ఆఫర్లు, కూపన్లతో దీన్ని మరింత తక్కువ ధరకు కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రొజెక్టర్ అమ్మకాలు లుమియో అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా ప్రారంభమయ్యాయి. కంపెనీ దీనిపై 1 సంవత్సరం వారంటీని కూడా అందిస్తోంది