E-Paper
Advertisement

గూగుల్ మ్యాప్స్‌లో రంగుల గుట్టు ఇదే.. హాస్పిటల్ నుంచి హోటల్ వరకు ఎలా గుర్తించాలో తెలుసా?

గూగుల్ మ్యాప్స్‌లో రంగుల గుట్టు ఇదే.. హాస్పిటల్ నుంచి హోటల్ వరకు ఎలా గుర్తించాలో తెలుసా?
Advertisement

Google Maps Color Codes: మనలో చాలామంది రోజువారీ ప్రయాణాల్లో గూగుల్ మ్యాప్స్ వాడుతుంటాం. అయితే మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు వేర్వేరు రంగుల్లో కనిపించే ఐకాన్లను మీరు గమనించే ఉంటారు. ముఖ్యంగా పర్పుల్, బ్లూ, ఆరెంజ్ వంటి రంగులు దేనికి సంకేతమో తెలిస్తే.. మ్యాప్ వాడటం ఇంకా సులభమవుతుంది. గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఐకాన్ల కలర్ కోడింగ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆకర్షణలకు పర్పుల్ రంగు..

మ్యాప్‌లో పర్పుల్ (ఊదా) రంగు ఐకాన్లు కనిపిస్తే.. అవి సందర్శనీయ ప్రాంతాలని అర్థం. సినిమా థియేటర్లు, మ్యూజియంలు, థీమ్ పార్కులు, చారిత్రక కట్టడాలు, ఫొటో స్పాట్లు ఈ రంగులోనే ఉంటాయి. విగ్రహాలు లేదా ప్రసిద్ధ స్మారక చిహ్నాల కోసం ప్రత్యేక గుర్తులు కూడా కనిపిస్తాయి. ఏదైనా కొత్త ఊరికి వెళ్లినప్పుడు చూడదగ్గ ప్రదేశాలను వెతకడానికి ఈ పర్పుల్ ఐకాన్లు బాగా ఉపయోగపడతాయి.

Advertisement

Also Read: రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!

అన్నింటికీ బ్లూ ఐకాన్లేనా?

మ్యాప్స్ వాడేవారికి బ్లూ రంగు ఐకాన్లతో కాస్త అయోమయం అనిపిస్తుంటుంది. బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోల్ బంకులు, పార్కింగ్ స్థలాలకు లైట్ బ్లూ రంగు ఇస్తారు. సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, కార్ల షోరూమ్‌లకు కాస్త థిక్ బ్లూ రంగు కనిపిస్తుంది. ఎయిర్‌పోర్టులకు మరో రకం డార్క్ బ్లూ ఐకాన్ ఉంటుంది. నీలం రంగులోనే ఇన్ని షేడ్స్ ఉండటం వల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు వెంటనే గుర్తుపట్టడం కాస్త కష్టంగానే ఉంటుంది.

ఫుడ్, హోటళ్లకు ప్రత్యేక రంగులు..

Advertisement

ఆహారం, బస కోసం గూగుల్ మ్యాప్స్ వేర్వేరు రంగులను కేటాయించింది. రెస్టారెంట్లు, కేఫ్‌లు, టీ కొట్లు ఆరెంజ్ రంగులో ఉంటాయి. హోటళ్లు, లాడ్జీలు, రిసార్టులు పింక్ రంగులో కనిపిస్తాయి. ఇక పార్కులు, అడవులు, కొండలు, బీచ్‌లు వంటి ప్రకృతి రమణీయ ప్రాంతాల కోసం గ్రీన్ రంగు పిన్స్ వాడతారు. ఈ కలర్ కోడింగ్ వల్ల వెతుక్కునే పనిలేకుండా మనకు కావలసినవి వెంటనే దొరుకుతాయి.

అత్యవసర సేవలకు రెడ్ పిన్స్..

హాస్పిటళ్లు, మెడికల్ షాపులు, ఫైర్ స్టేషన్లు వంటి అత్యవసర సేవల కోసం రెడ్ రంగు ఐకాన్లను ఉపయోగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, ప్రైవేట్ అపార్ట్‌మెంట్లు గ్రే రంగులో కనిపిస్తాయి. ఇలా గూగుల్ మ్యాప్స్ ఇచ్చిన రంగుల అర్థం తెలుసుకుంటే ప్రయాణాల్లో సమయం వృధా కాకుండా, మనకు కావలసిన ప్రదేశాన్ని క్షణాల్లో గుర్తుపట్టి సులభంగా చేరుకోవచ్చు.

Also Read: 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారత్‌లోకి వివో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఎంట్రీ!

Tags

Related News

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

కిడ్స్ సేఫ్టీ కోసం మెటా మాస్టర్ ప్లాన్..హానికరమైన లింక్స్, ఫేక్ యాడ్స్ మాయం!

120 ఇంచుల బిగ్ స్క్రీన్ మ్యాజిక్..కొత్త లుమియో ఆర్క్ 7 ప్రొజెక్టర్‌తో ఇల్లే థియేటర్!

రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!

అమెజాన్ సేల్..ఐఫోన్,వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని తగ్గింపు!

మీ ఫోన్‌లో ఫోటోలు ముందులా రావట్లేదా? కెమెరా క్వాలిటీ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!

10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారత్‌లోకి వివో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×