E-Paper
Advertisement

మీ ఫోన్‌లో ఫోటోలు ముందులా రావట్లేదా? కెమెరా క్వాలిటీ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!

మీ ఫోన్‌లో ఫోటోలు ముందులా రావట్లేదా? కెమెరా క్వాలిటీ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!
Advertisement

Phone camera quality issues: కొత్తలో అద్భుతమైన ఫోటోలు తీసిన మీ ఫోన్ కెమెరా ఇప్పుడు డల్ అయిపోయిందా? తీసిన ప్రతి ఫోటో బ్లర్‌గా లేదా క్లారిటీ లేకుండా వస్తోందా? దీనికి కారణం మీ ఫోన్ పాత బడిపోవడమే కాదు, మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా కావచ్చు! లెన్స్ మీద పడే గీతలు, పేరుకు పోయే దుమ్ము, కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్ వంటి ఎన్నో కారణాలు మీ కెమెరా క్వాలిటీని దెబ్బతీస్తాయి. అసలు ఫోన్ కెమెరా ఎందుకు పాడవుతుంది? దీనిని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. లెన్స్ మీద గీతలు,దుమ్ము:

మనం ఫోన్‌ను ఎక్కడ పడితే అక్కడ బోర్లా వేయడం, జేబులో లేదా బ్యాగులో కీస్‌తో పాటు పెట్టుకోవడం వల్ల కెమెరా గ్లాస్ మీద చిన్న చిన్న గీతలు పడుతుంటాయి. దీని వల్ల లెన్స్‌పై లైట్ సరిగ్గా పడక ఫోటోలు మసకగా వస్తాయి. అలాగే లెన్స్ చుట్టూ దుమ్ము పేరుకుపోవడం.. కూడా ఫోటో క్వాలిటీని దెబ్బతీస్తుంది.

Advertisement

పరిష్కారం: ఎప్పుడైనా ఫోటో తీసే ముందు లెన్స్‌ను మైక్రో ఫైబర్ క్లాత్‌తో శుభ్రం చేయండి. అంతే కాకుండా మంచి కెమెరా ప్రొటెక్టర్ గ్లాస్ వాడటం చాలా ముఖ్యం.

2. సాఫ్ట్‌వేర్,యాప్ అప్‌డేట్స్ :

చాలా మంది ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయకుండా పాత వెర్షనే వాడతారు. కొన్నిసార్లు బగ్స్ వల్ల కెమెరా ఆప్టిమైజేషన్ దెబ్బతింటుంది. అలాగే మనం థర్డ్-పార్టీ యాప్స్ (ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటివి) ద్వారా నేరుగా ఫోటోలు తీసినప్పుడు, ఆ యాప్స్ కెమెరా రెసొల్యూషన్‌ను తగ్గించేస్తాయి.

Advertisement

పరిష్కారం: మీ ఫోన్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్‌కి అప్‌ డేట్ చేసుకోండి. వీలైనంత వరకు ఫోన్ ఒరిజినల్ కెమెరా యాప్‌ తోనే ఫోటోలు క్యాప్చర్ చేయండి.

3. ఇంటర్నల్ స్టోరేజ్ నిండిపోవడం:

ఫోన్ మెమరీ దాదాపుగా నిండిపోయినప్పుడు, ఫోన్ ప్రాసెసర్, ర్యామ్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీని వల్ల ఇమేజ్ ప్రాసెసింగ్ స్లో అయిపోయి, హై-క్వాలిటీ ఫోటోలు సేవ్ అయ్యేటప్పుడు క్వాలిటీ తగ్గిపోతుంది లేదా ఫోటోలు బ్లర్ అవుతాయి.

పరిష్కారం: మీ ఫోన్ స్టోరేజ్‌లో కనీసం 10 నుంచి 15 శాతం ఖాళీ స్థలం ఉండేలా చూసుకోండి. అనవసరమైన ఫైల్స్, వీడియోలను డిలీట్ చేయండి.

4. లెన్స్‌లో తేమ:

వర్షాకాలంలో లేదా ఎక్కువ వేడి నుంచి చల్లటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు కెమెరా లెన్స్ లోపలి భాగంలో తేమ లేదా నీటి ఆవిరిచేరుతుంది. ఇది లెన్స్‌ను మసకబారేలా చేసి, క్లియర్ ఫోటోలు రాకుండా అడ్డుకుంటుంది.

పరిష్కారం: మీ ఫోన్‌కు నీరు తగలకుండా చూసుకోండి. ఒక వేళ లోపల తేమ చేరితే వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం మంచిది.

Also Read: సగం ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీ..ఆఫర్ మామూలుగా లేదుగా!

5. హార్డ్‌వేర్ సమస్యలు:

ఫోన్ కింద పడిపోవడం వల్ల కెమెరా మోడ్యూల్ లేదా ఆటో-ఫోకస్ మెకానిజం దెబ్బతింటుంది. దీని వల్ల కెమెరా ఫోకస్ చేసు కోలేక ఇమేజ్ బ్లర్‌గా మారుతుంది. అలాగే కాలం గడిచే కొద్దీ ఫోన్ ఇమేజ్ సెన్సార్ పని తీరు కూడా సహజంగానే కొద్దిగా మందగిస్తుంది.

పరిష్కారం: ఫోన్ కింద పడకుండా సేఫ్‌గా వాడండి. ఒక వేళ హార్డ్‌వేర్ ప్రాబ్లం ఉంటే సర్వీస్ సెంటర్‌లో రిపేర్ చేయించుకోవాలి. రిపేర్ ఖర్చులు సాధారణంగా మోడల్‌ను బట్టి రూ. 1,000 నుంచి రూ. 4,500 వరకు ఉండొచ్చు.

మీ ఫోన్ కెమెరా ఎప్పటికీ కొత్త దానిలా పని చేయాలంటే.. లెన్స్‌ను శుభ్రంగా ఉంచుకోవడం, ఫోన్‌ను కింద పడకుండా చూసుకోవడం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ రెగ్యులర్‌గా చేయడం చాలా ముఖ్యం!

Related News

రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!

అమెజాన్ సేల్..ఐఫోన్,వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని తగ్గింపు!

10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారత్‌లోకి వివో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఎంట్రీ!

అమెజాన్ స్పెషల్ సేల్..ఊహించనంత తక్కువ ధరకే వాటర్ హీటర్లు

వాక్యూమ్ క్లీనర్లపై ఎప్పుడూ చూడని ఆఫర్లు..అస్సలు మిస్సవ్వొద్దు

ఒక్క రీఛార్జ్.. 4 ఓటీటీలు ఉచితం.. ఎయిర్‌టెల్ బంపరాఫర్!

సగం ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీ..ఆఫర్ మామూలుగా లేదుగా!

Big Stories

Advertisement
×