TOSS DRAMA AT THE IND VS PAK: రైసింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) భాగంగా దోహ (West End Park International Cricket Stadium, Doha) వేదికగా పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా (India A vs Pakistan A, 8th Match) జూనియర్ల మధ్య ఎనిమిదవ మ్యాచ్ జరుగుతోంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ నేపథ్యంలో టాస్ వివాదంగా (TOSS DRAMA ) మారింది. ఇందులో పాకిస్తాన్ టాస్ గెలిచినప్పటికీ… అక్కడే ఉన్న మ్యాచ్ రిఫరీ ఇండియాకు అనుకూలించాడని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో టాస్ లోనూ టీమిండియా కుట్ర చేసిందని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంటులో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జూనియర్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ టాస్ సమయంలో కాయిన్ పైకి ఎగిరే వేయగానే పాకిస్తాన్ కెప్టెన్ అబ్దుల్ సమాద్ హెడ్స్ అని పేర్కొన్నాడు. కానీ టేయిల్స్ పడిందని టీం ఇండియాకు అనుకూలంగా అక్కడ ఉన్న మ్యాచ్ రిఫరీ తప్పుగా ప్రకటన చేశాడు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పాకిస్తాన్ కెప్టెన్ అబ్దుల్ సమద్ వెంటనే టాస్ వేసిన కాయిన్ ను మళ్ళీ చూశాడు. అది హెడ్ పడిందని పాక్ కెప్టెన్ సమద్ గట్టిగా నొక్కి చెప్పాడు.
దీంతో సవరించుకున్న మ్యాచ్ రిఫరీ.. పాకిస్తాన్ టాస్ గెలిచిందని ప్రకటించేశాడు. దీంతో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చూసిన పాకిస్తాన్ అభిమానులు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ లోను టీమిండియా ఫిక్సింగ్ చేస్తానని.. ఈ మ్యాచ్ లో టాస్ సమయంలో కూడా దిగజారి ప్రవర్తించిందని ఫైర్ అవుతున్నారు. అక్కడ ఉన్న మ్యాచ్ రిఫరీలు కూడా బీసీసీఐ డబ్బులకు అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆసియా కప్ రైసింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న టాస్ వివాదంపై పుర్ఖాన్ భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కడూ టీమిండియాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని..బీసీసీఐ ఇచ్చే పచ్చ నోట్లకు అమ్ముడుపోతున్నారని మండిపడ్డాడు. పాకిస్తాన్ ను ఓడించేందుకు అన్ని విధాల టీమిండియా కుట్రలకు తెరలేపిందని ఫైర్ అయ్యాడు. దీనిపై కచ్చితంగా విచారణ జరగాలని డిమాండ్ చేశాడు.
🚨 TOSS DRAMA AT THE RISING STARS ASIA CUP.👀
– The match referee initially announced the toss result incorrectly, but Pakistan captain Abdul Samad immediately pointed out the mistake and asked him to recheck.
– Abdul Samad was right, and the match referee corrected his call… pic.twitter.com/fzP8TA8pTJ
— Talha Digital. (@CallMeDigital1_) November 22, 2026