Rating Scam : నేటి డిజిటల్ యుగంలో ఎన్ని సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్స్ సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ గాడ్జెట్స్ వాడే యూజర్స్ ను ఆసరాగా తీసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో క్రైమ్స్ బయటపడుతుండగా తాజాగా మరో స్కామ్ బయటపడింది. ఇందులో బాధితుడు ఓ పథకానికి రేటింగ్ ఇవ్వడంతో లక్షల్లో పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.
సైబర్ క్రైమ్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎటువంటి అనుమానాస్పద లింక్స్ ఓపెన్ చేయకండి. తెలియని నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయకండి. తెలియని నెంబర్ల నుంచి వచ్చిన మెసేజెస్ లో ఉండే లింక్స్ ఓపెన్ చేయొద్దు. ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు సైబర్ పోలీసులు ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడో ఒకచోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి టెలిగ్రామ్ లో వచ్చిన ఒక సందేశంకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వటంతో భారీ స్కాంలో ఇరుక్కుపోయాడు.
ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ కు సందీప్ అరోరా అనే వ్యక్తి నుంచి టెలిగ్రామ్ లో ఓ సందేశం వచ్చింది. ఈ సందేశం ప్రకారం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాల్సిందిగా కోరగా.. ప్రవీణ్ అలాగే రేటింగ్ ఇచ్చి మోసపోయాడు. ఓ యాప్ కు రేటింగ్ ఇవ్వాల్సిందిగా తనని కోరటం ఆసక్తిగా అనిపించడంతో ఈ టాస్క్ ను స్వీకరించే పనిలో పడ్డానని తెలిపాడు
అసలు ఈ స్కామ్ ఎలా జరిగిందంటే –
ప్రవీణ్ కుమార్ కు టెలిగ్రాంలో ఓ లింక్ వచ్చింది. దాంట్లో రూ. 3,999 ప్రారంభ చెల్లింపుతో మీకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయొచ్చని ఆ వ్యక్తి తెలిపాడు. తక్కవ డబ్బులతోనే ఎక్కువ లాభాలు పొందే ఛాన్స్ ఉందని నమ్మించాడు. ఇలా వేరు వేరు ప్రయోజనాల నుంచి మరిన్ని లాభాలు పొందే అవకాశం ఉందని చెబుతూ అతని నుంచి మూడు దఫాలుగా రూ.15,999 కొట్టేశాడు. ఆపై మరింత నమ్మిస్తూ రూ.1,49,999 కొట్టేశాడు. ఇంత డబ్బులు కొట్టేశాక కూడా ఆ వ్యక్తి ప్రవీణ్ నుంచి రూ.2,99,999 పంపించమని అడగడంతో ఎక్కడో అనుమానాస్పదంగా అనిపిస్తుందని ఆ వ్యక్తి గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఇప్పటివరకూ అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దని ఎన్నోసార్లు హెచ్చరించామని అయినాప్పటికీ బాధితులు మోసపోతున్నారని మరోసారి తెలిపారు. ఏదైనా తెలియని నెంబర్ నుంచి లింకు వచ్చినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో మొదటగా ధ్రువీకరించుకోవాలని తెలిపారు. అంతేకాకుండా సంప్రదించిన వ్యక్తి ఎవరు? ఏంటి? అన్న విషయాలు తెలుసుకోవాలని.. అవసరమైతే టెక్నాలజీ తెలిసిన వ్యక్తులను సంప్రదించాలని అవసరమైతే పోలీసుల్ని ఆశ్రయించాలని హెచ్చరించారు. ఎలాంటి చెల్లింపులు అయినా ముందుగా చెల్లించవద్దని హెచ్చరించారు. అనుమానాస్పదంగా అనిపించే స్కీమ్స్ జోలికి పోవొద్దని లేదంటే తీవ్ర స్థాయిలో నష్టపోవద్దని హెచ్చరించారు
ALSO READ : iPhone, iPad, Mac వాడుతున్నారా..! మరి మీ డేటా సేఫ్టీ సంగంతేంటి!