E-Paper
Advertisement

ప్రెగ్నెన్సీ లో కూడా తగ్గేదేలే.. సమంత డెడికేషన్ కి ఫ్యాన్స్ ఫిదా!

ప్రెగ్నెన్సీ లో కూడా తగ్గేదేలే.. సమంత డెడికేషన్ కి ఫ్యాన్స్ ఫిదా!
Advertisement

Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సమంత (Samantha ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతోనే కాదు కష్టాల్లో కూడా తాను చూపిస్తున్న సహనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా కష్టం ఏదైనా సరే తనకు తగ్గట్టుగా మలుచుకునే గొప్ప నేర్పరి అనడంలో సందేహం లేదు. భర్త నుంచి విడాకులు తీసుకోవడం , మయోసైటిస్ వ్యాధి బారిన పడడం, సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కోవడం, ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. మళ్ళీ గోడకు కొట్టిన బంతి లాగా అంతే వేగంగా బౌన్స్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రెగ్నెన్సీలో కూడా జిమ్లో భారీ వర్కౌట్స్..

అలాంటి సమంత బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Nidimoru)తో ఏడడుగులు వేసింది. పైగా గర్భం దాల్చి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. అయితే సాధారణంగా గర్భం దాల్చిన ప్రతి మహిళా కూడా.. క్షేమంగా డెలివరీ అయ్యే వరకు వైద్యుల సమక్షంలో ఎంతో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా బరువులు ఎత్తడం వంటివి అసలుకే చేయరు. కానీ సమంత మాత్రం ప్రెగ్నెన్సీలో కూడా జిమ్ వర్కౌట్స్ చేస్తూ.. హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ,ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఒక విషయాన్ని అభిమానులతో షేర్ చేసింది.

హెవీ వర్కౌట్స్ పై సమంతా రియాక్షన్..

Advertisement

తాజాగా ప్రెగ్నెన్సీ తో బేబీ బంప్ తో కనిపిస్తూనే.. జిమ్ వర్కౌట్స్ లో తెగ కష్టపడిపోతున్న సమంత అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. “నేను కడుపుతో ఉన్నప్పటికీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ను కొనసాగిస్తున్నాను. దీనికోసం ఇంతకుముందే డాక్టర్ అనుమతి కూడా తీసుకున్నాను.. నా ట్రైనర్ కూడా ప్రీనేటల్ ట్రైనింగ్ లో శిక్షణ పొందిన వ్యక్తి. నా శరీర పరిస్థితి, అనుభవం, ప్రస్తుత గర్భధారణకు అనుగుణంగా ప్రతి వ్యాయామాన్ని అవసరమైన విధంగా మార్పులు చేసి చేస్తున్నాను. సాధారణంగా ప్రతి మహిళకు గర్భధారణ అనుభవం వేరేగా ఉంటుంది. కానీ నేను చేస్తున్న వ్యాయామాలు , ఇతరులు వాళ్లకు వాళ్ళు సొంతంగా దయచేసి చేయవద్దు. ప్రెగ్నెన్సీ తో వర్క్ అవుట్ చేసే ముందు తప్పనిసరిగా మీ గైనకాలజిస్ట్ ను సంప్రదించండి. అర్హత కలిగిన నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామాలు చేయండి. లేనిచో వ్యాయామాలకు దూరంగా పారాయణం చేస్తూ బిడ్డ రాక కోసం ఎదురుచూడండి” అంటూ సమంత తెలియజేసింది.

also read:టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

సమంత మూవీస్..

Advertisement

మొత్తానికి అయితే బేబీ బంప్ తో కూడా సమంత ఇలా ఈ వర్కౌట్స్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇకపోతే సమంత డెడికేషన్ చూస్తుంటే తొమ్మిదవ నెలలో కూడా సమంత ఇలాగే వర్కౌట్స్ చేస్తుందా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సమంత ‘సిటాడెల్ : హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో హిందీలో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తెలుగులో ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. మరొకవైపు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్స్ స్థాపించి ‘శుభం’ సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యింది సమంత.

Related News

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

కాంతార వైబ్‌లో గోపీచంద్ ‘భరత వర్ష’.. ఫస్ట్ సాంగ్ అదిరిపోయిందిగా!

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

Big Stories

Advertisement
×