BigTV English

Mercedes Benz : బెంజ్ కార్ ప్రియులకు షాక్… డిసెంబర్ వరకే ఛాన్స్

Mercedes Benz : బెంజ్ కార్ ప్రియులకు షాక్… డిసెంబర్ వరకే ఛాన్స్

Mercedes Benz : జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లగ్జరీ వాహన ప్రియుల కోసం సరికొత్త డిజైన్, భద్రత ఫీచర్లు ఉన్న విలాసవంతమైన కార్లను మార్కెట్​లలోకి విడుదల చేస్తుంటుంది. అలానే భారత్‌లోని చిన్న నగరాల్లో కూడా తన ఉనికిని విస్తరించుకోవడానికి గత కొద్ది నెలలుగా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే భవిష్యత్​లో చిన్న నగరాల్లోనూ లగ్జరీ మోడళ్లకు డిమాండ్‌ పెరుగుతుందని సందరు సంస్థ భావిస్తోంది. అందుకే పెరుగుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి, సేవా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ముందుకెళ్తోంది.


అయితే​ ఈ క్రమంలోనే మెర్సిడెస్​ బెంజ్ వాహన ప్రియులకు షాకిచ్చింది! ప్రస్తుతం తమ కార్ల ధరల పెంపునకు సిద్ధమైంది. తమ సంస్థకు చెందిన అన్నీ మోడల్ కార్ల ధరల్ని 3 శాతం వరకు పెంచనున్నట్లు తాజాగా అధికారికంగా అనౌన్స్ చేసింది. 2025 జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు స్పష్టత ఇచ్చింది. అయితే డిసెంబర్‌ 31 లోపు తమ లగ్జరీ కార్లను బుకింగ్‌ చేసుకునే వారికి ఈ పెంపు వర్తించదని క్లారిటీ ఇచ్చింది. అంటే ఈ లెక్కన బెంజ్​ కార్ల ధరలు కనిష్ఠంగా రూ. 2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి బెంజ్ కార్ ప్రియులకు ఇది షాకింగ్ వార్తనే చెప్పాలి.

తమ సంస్థకు చెందిన కార్ల ధరల పెంపుదల ఎందుకు చేస్తున్నట్లో కూడా వివరించింది మెర్సిడెస్​. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. “ద్రవ్యోల్బణం, ఇంధన ధరల్లో హెచ్చు తగ్గుల కారణంగా ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాం. ఈ హెచ్చు తగ్గుల కారణంగా వ్యాపార కార్యకలాపాలపై భారీ ఒత్తిడి పెరుగుతోంది. గత మూడు త్రైమాసికాల నుంచి పరిశీలిస్తే కంపెనీ నిర్వహణ వ్యయం కూడా బాగా పెరుగుతోంది. అందుకే ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని మెర్సిడెస్‌ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వీటి సేల్స్ పెరుగుతున్నాయని.. వాటికి అనుగుణంగానే ధరలు కూడా పెంచాల్సి వస్తుందని తెలిపారు.


Mercedes Benz Indian Sales : కాగా, మెర్సిడెస్‌ బెంజ్‌ ప్రస్తుతం రూ. 45 లక్షలు విలువైన ఏ క్లాస్‌ కార్ల నుంచి రూ. 3.6 కోట్ల జీ63 ఎస్‌యూవీ వరకు అనేక రకాల మోడళ్లను దేశీయంగా విక్రయిస్తోంది. అలానే ఈ లగ్జరీ కార్ల విక్రయాలు భారత్‌లో గణనీయంగా పెరిగినట్లు గత నెల అక్టోబర్​లో రిపోర్ట్ వచ్చింది. 2024 సంవత్సరంలో మొదటి 9 నెలల(జనవరి-సెప్టెంబర్‌) కాల వ్యవధిలో 13% వృద్ధితో 14,379 కార్లను విక్రయించినట్లు తెలిసింది.

Mercedes Benz Recently Launched Car : ఇకపోతే రీసెంట్​గానే మెర్సిడెస్​ బెంజ్​ ‘ఏఎంజీ సీ 63 ఎస్‌ ఈ పెర్ఫార్మెన్స్‌’ కారును మార్కెట్​లోకి రిలీజ్​ చేసింది. ఎఫ్‌1 హైబ్రిడ్‌ టెక్నాలజీతో దీనిని రూపొందించింది. ఈ కారు ధర రూ. 1.95 కోట్లు. 2024లో మెర్సిడెస్​ కంపెనీ నుంచి వచ్చిన 24వ మోడల్‌ ఇది. ఈ విలాసవంతమైన కారు గంటకు 0-100 కి.మీ వేగాన్ని కేవలం 3.4 సెకన్లలోనే అందుకుంటుంది.

Related News

Dance Heart Attack: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి

Smart phones 2025: టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్.. రూ. 20 వేల కంటే తక్కువ బడ్జెట్ ఫోన్లు ఇవే..

OnePlus Discount: 6,000mAh బ్యాటరీ, 50 MP కెమెరా.. వన్‌ప్లస్ మిడ్‌రేంజ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్

Smartphone Comparison: పోకో X7 ప్రో vs ఓప్పో F31 vs రియల్మీ P4 ప్రో.. ఏది బెస్ట్?

Verify Fake iphone: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో నకిలి ఐఫోన్ డెలివరీ? ఈ జాగ్రత్తలు పాటించండి

Oppo Phone: 56జిబి స్టోరేజ్, 5జి స్పీడ్.. ఫ్లిప్ మోడల్‌లో కొత్త సెన్సేషన్..

Motorola Mobiles: ఒకే ఫోన్‌లో అన్నీ! ఫాస్ట్ ఛార్జ్ తో వచ్చేసిన మోటరోలా అల్ట్రా బీస్ట్!

Wifi Plans Free OTT: 100Mbps వైఫై.. ఉచితంగా ఓటీటీ.. బెస్ట్ ప్లాన్స్ ఇవే

Big Stories

×