BigTV English

Two Women Fight: వైజాగ్ లో ఇద్దరు మహిళల ఘర్షణ.. నీటి యుద్దం కాదు కానీ.. తెగ కొట్టుకున్నారు

Two Women Fight: వైజాగ్ లో ఇద్దరు మహిళల ఘర్షణ.. నీటి యుద్దం కాదు కానీ.. తెగ కొట్టుకున్నారు

Two Women Fight: అదొక మార్కెట్. ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఓ వైపు వ్యాపారస్తులు.. మరోవైపు వినియోగదారుల తో నిండుగా ఉంటుంది. అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా మరింత నిండుగా కనిపించింది. అది కూడా ఎప్పుడూ లేనంతగా.. ఏదో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. అందుకే మార్కెట్ లో ఆ జోరు ఉందని అనుకుంటే పొరబాటే. అసలేం జరిగిందంటే?


విశాఖ జిల్లా గాజువాక మార్కెట్ అంటే తెలియని వారు ఉండరు. ఇక్కడ దొరకనిది కూడా ఉండదు. ఈ మార్కెట్ ఆధారంగా ఎందరో వ్యాపారస్తులు, తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తారు. అందుకే వినియోగదారులు కూడా ఈ మార్కెట్ వైపు ఎక్కువగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.

అయితే శుక్రవారం ఉన్నట్లుండి మార్కెట్ లో అధికంగా జన సమూహం ఏర్పడింది. కొనుగోళ్ల కు కాదు కానీ, ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని కుళాయి వద్ద నీటి కోసం ఘర్షణ పడిన రీతిలో కొట్టుకున్నారు. అసలేం జరిగిందో తెలియని పరిస్థితి అక్కడి వారిది. వారు మాత్రం ఏ మాత్రం కోపాన్ని నియంత్రించుకోలేని స్థితిలో ఆవేశంతో ఊగిపోతున్నారు. అంతలోనే ఇద్దరు పురుషులు కూడా ఘర్షణకు పాల్పడ్డారు. అటు మహిళల యుద్ధం సాగుతుండగా.. ఇటు పురుషులు.


Also Read: Donkey Milk Scam: గాడిదలతో లక్షల్లో ఆదాయమట.. క్యూ కట్టిన ప్రజలు.. దిమ్మతిరిగే షాకిచ్చిన నిర్వాహకుడు

మార్కెట్ కు వచ్చిన వినియోగదారులు అక్కడికి గుమికూడారు. కొంతసేపు భయాందోళన చెందిన వారు కూడా, ఘర్షణ సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ససేమిరా అలాగే ఘర్షణ సాగుతున్న క్రమంలో పోలీసులు ఎంటర్.. మార్కెట్ రచ్చ పోలీస్ స్టేషన్ కు చేరింది. అయితే ఈ మహిళలు ఘర్షణ పడ్డ తీరును అక్కడి స్థానికులు వీడియో తీయగా, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు ఈ ఘర్షణకు కారణం ఏమిటంటే దుకాణ స్థల వివాదమేనట. నీటి యుద్దాన్ని తలపించేలా ఘర్షణకు దిగింది ఎవరో తెలుసా.. అక్కడి చిరు వ్యాపారులు.

పొట్టకూటి కోసం చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించే వారి మధ్య ఏ మనస్పర్థలు వచ్చాయో కానీ, ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండీగా మారింది. సర్దుకుపోయే స్థితిలో ఇలా మార్కెట్ లో మహిళలు ఘర్షణ పడుతుంటే, సర్ది చెప్పాల్సిన పురుషులు కూడా ఘర్షణకు దిగడం ఎంతవరకు సమంజసమని స్థానికులు చర్చించుకున్నారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×