MG Windsor EV Price Hike: ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్న వారికి MG మోటార్ ఇండియా షాకిచ్చింది. కంపెనీ తన పాపులర్ ఎలక్ట్రిక్ కారు విండ్సర్ EV ధరలను పెంచింది. అన్ని వేరియంట్లపై రూ.15,000 చొప్పున ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ధరలతో పోలిస్తే ఈ కారు కొనుగోలు చేయడానికి కస్టమర్లు మరికొంత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ధరల పెంపు తర్వాత MG విండ్సర్ EV ప్రారంభ ధర రూ.14.85 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.19.15 లక్షలకు చేరింది. కొత్త ధరలతో పాటు ఈ ఎలక్ట్రిక్ కారు వేరియంట్లు, బ్యాటరీ, రేంజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
JSW MG మోటార్ ఇండియా విండ్సర్ EVని ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు ప్రధాన వేరియంట్లలో విక్రయిస్తోంది. వీటితో పాటు ఎక్స్ క్లూజివ్ ప్రో, ఎసెన్స్ ప్రో వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తాజాగా కంపెనీ చేసిన ధరల సవరణ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. ప్రతి మోడల్‌పై రూ.15,000 పెరిగింది. దీంతో విండ్సర్ EV ధరల శ్రేణి రూ.14.85 లక్షల నుంచి రూ.19.15 లక్షల వరకు చేరింది.
విండ్సర్ EV ప్రో మోడళ్లలో సాధారణ వెర్షన్లతో పోలిస్తే పెద్ద బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది. ఇందులో 52.9kWh బ్యాటరీని ఉపయోగించారు. అంతేకాకుండా ప్రత్యేకమైన ఇంటీరియర్ థీమ్, ADAS ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ప్రో వేరియంట్లకు కూడా తాజాగా ప్రకటించిన రూ.15,000 ధరల పెంపు వర్తిస్తుంది.
ఇటీవల MG విడుదల చేసిన విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్‌కు మాత్రం ఈ ధరల పెంపు వర్తించదు. ఈ ప్రత్యేక ఎడిషన్ ధర రూ.18 లక్షలుగా కొనసాగుతోంది. ఇది సాధారణ 38kWh బ్యాటరీ వెర్షన్ ఆధారంగా రూపొందించారు. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే సుమారు రూ.85,000 ఎక్కువ ధరతో అందుబాటులో ఉంది. ఈ ఎడిషన్‌ను కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో ప్రధానంగా ఎక్స్‌టీరియర్ డిజైన్, కొన్ని ఫీచర్లలో మార్పులు చేశారు.
MG విండ్సర్ EV రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో 39kWh, 52.9kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. 39kWh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 52.9kWh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. .
MG విండ్సర్ EV ధరల పెంపు పెద్ద మొత్తంలో లేకపోయినా, అన్ని వేరియంట్లపై ఒకేసారి ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ, అదనపు ఫీచర్లు కోరుకునే కస్టమర్లు ప్రో వేరియంట్లు బెస్ట్ ఆప్షన్ కానున్నాయి. ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవారు కొత్త ధరలను దృష్టిలో పెట్టుకుని తమ బడ్జెట్‌ను నిర్ణయించుకోవడం మంచిది.
Read Also: రూ.7 లక్షల నుంచి రూ.1 కోటి వరకు.. నవంబర్‌లో రానున్న కొత్త కార్లు ఇవే!