E-Paper
Advertisement

కోమటిరెడ్డి రాజగోపాల్, అనిరుధ్ రెడ్డి ఇష్యూ.. టీపీసీసీ మహేష్‌కుమార్ కీలక వ్యాఖ్యలు, వేటు తప్పదా?

కోమటిరెడ్డి రాజగోపాల్, అనిరుధ్ రెడ్డి ఇష్యూ.. టీపీసీసీ మహేష్‌కుమార్ కీలక వ్యాఖ్యలు, వేటు తప్పదా?
Advertisement

Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాట తప్పు తున్న నేతలపై వేటు తప్పదా? దానికి సంబంధించి వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? రానున్న రోజుల్లో ఆయా నేతలపై వేటు తప్పదా? ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్ పరిశీలన చేస్తోందా? టీపీసీసీ మహేష్ కుమార్ చేసిన మాటలు నిజమేనన్న సంకేతాలు ఇస్తోందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.

కాంగ్రెస్ పార్టీలో నేతలకు ఊహించని స్వేఛ్చ ఉంటుంది. ఎవరు, ఎప్పుడైనా, ఏమైనా మాట్లాడవచ్చు. ప్రత్యర్థులపైనే కాదు.. సొంత పార్టీ నేతలపై మాటల దూకుడు పెంచుతారు. కొందరు నేతలు ‘అతి’ మాటల వల్ల పార్టీకి ఇబ్బందులు తప్పలేదు. గతంలో చాలామంది నేతలు ఆ విధంగా బయటకు వెళ్లిపోయారు కూడా. తాజాగా కాంగ్రెస్ సీనియర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ధ్ వ్యవహారాలపై ఆ పార్టీలో సీరియస్‌గా చర్చ జరుగుతోంది.

Advertisement

దీనిపై రియాక్ట్ అయ్యారు తెలంగాణ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే అన్నారు. నేతల మాటలను హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమేనని తేల్చేశారు. సమయం వచ్చినప్పుడు అందరినీ పిలిచి మాట్లాడతామని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఏ సందర్భంలో ఆయా వ్యాఖ్యలు చేశారో పార్టీ నిశితంగా పరిశీలిస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన ప్రజాస్వామ్య వ్యవస్థను అవలంబిస్తుందన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందని సంకేతాలు ఇచ్చారు.

Advertisement

 

Related News

హైదరాబాదీలకు బంపరాఫర్.. ఇంటికో ఇంకుడు గుంత, రూ. 10 లక్షలు గెలవండి!

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై.. కీలక వ్యాఖ్యలు చేసిన మహేష్ కుమార్ గౌడ్!

ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలనుకునే వారికి షాకింగ్ న్యూస్?

క్రీడల విషయంలో.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు చాలెంజ్?

ఇకపై సభలు, ఫంక్షన్ల నిర్వహణపై.. మున్సిపల్ కార్పొరేషన్ కొత్త రూల్స్?

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్.. బీఆర్ఎస్‌కు సవాల్!

తెలంగాణకు అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు!

Big Stories

Advertisement
×