E-Paper
Advertisement

కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? అసలు నిజం తెలిస్తే ఎప్పటికీ అలా చేయరు!

కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? అసలు నిజం తెలిస్తే ఎప్పటికీ అలా చేయరు!
Advertisement

Charging phone in car: ప్రస్తుత బిజీ లైఫ్‌లో కొంత మంది లైఫ్ చాలా వరకు ప్రయాణాల్లోనే గడిచిపోతుంది. ఆఫీసుకు వెళ్లేటప్పుడు లేదా లాంగ్ డ్రైవ్‌కు వెళ్లేటప్పుడు చాలామంది తమ ఫోన్‌ను కారులోనే ఛార్జ్ చేస్తుంటారు. కారులో ఉన్న యూఎస్‌బీ పోర్ట్ ల కేబుల్ పెట్టడం చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ.. ఇలా రోజూ కారులో ఫోన్ ఛార్జ్ చేయడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ ఆయుష్షు వేగంగా తగ్గి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్ నిపుణులు చెబుతున్న ఆ ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కారులో ఛార్జింగ్ చేసేటప్పుడు చేసే పొరపాట్లు:

1. కారులోని లో-పవర్ USB పోర్ట్‌లను వాడటం:

చాలా కార్లలో.. ఉండే ఇన్‌బిల్ట్ USB పోర్ట్‌లు కేవలం ఆడియో ప్లే చేయడానికి లేదా మ్యూజిక్ సిస్టమ్ కనెక్ట్ చేయడానికి మాత్రమే డిజైన్ చేసి ఉంటాయి. వాటి నుంచి వచ్చే కరెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి తక్కువ పవర్ ఉన్న పోర్ట్‌ల ద్వారా ఫోన్ ఛార్జ్ పెట్టినప్పుడు, ఫోన్ ఛార్జ్ ఎక్కడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇది మీ ఫోన్ మదర్‌బోర్డ్, బ్యాటరీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

2. ఇంజిన్ ఆన్ చేయకముందే ఫోన్ ఛార్జ్ పెట్టడం:

Advertisement

చాలా మంది కార్ స్టార్ట్ చేయకుండానే.. కేవలం ‘ఇగ్నిషన్’ ఆన్ చేసి ఫోన్ ఛార్జింగ్ పెడుతుంటారు. కార్ స్టార్ట్ అయ్యే.. సమయంలో ఒక్క సారిగా పవర్ ఫ్లక్చువేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కరెంట్ సరఫరా వల్ల మీ ఫోన్ సర్క్యూట్ షార్ట్ అయ్యే ప్రమాదం ఉంది లేదా బ్యాటరీ శాశ్వతంగా దెబ్బతింటుంది.

3. వేడి వాతావరణం, ఫోన్ ఓవర్‌హీటింగ్:

కారులో ఎండ తగిలే ప్రదేశంలో.. లేదా డాష్‌ బోర్డ్ పై ఫోన్ ఉంచి ఛార్జింగ్ పెడుతుంటారు.సమ్మర్ లో లేదా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కారు లోపలి ఉష్ణోగ్రత విపరీతంగా.. పెరుగుతుంది. ఈ సమయంలో.. ఫోన్ ఛార్జ్ పెడితే అది మరింత వేడెక్కి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

Advertisement

Also Read: రూ.30వేలలోపే ల్యాప్‌టాప్..హెచ్‌పి 14q స్పెసిఫికేషన్స్ ఇవే!

ఫోన్ బ్యాటరీ కాపాడుకోవడానికి సరైన పద్ధతులు:

మంచి కార్ ఛార్జర్ వాడండి: కారులో లోకల్ లో-క్వాలిటీ ఛార్జర్లు వాడే బదులు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మంచి బ్రాండెడ్ కార్ ఛార్జర్లను మాత్రమే ఉపయోగించండి. ఇవి అవసరమైన కరెంట్‌ను మాత్రమే ఫోన్‌కు అందిస్తాయి.

కారు స్టార్ట్ చేసిన తర్వాతే కనెక్ట్ చేయండి: ఎప్పుడైనా సరే, కారు ఇంజిన్ పూర్తిగా స్టార్ట్ అయిన తర్వాతే.. మీ ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టడం మంచి అలవాటు.

నేవిగేషన్ సమయంలో జాగ్రత్త: గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తూ.. కారులో ఫోన్ ఛార్జ్ చేస్తే ఫోన్ మరింత వేడెక్కుతుంది. వీలైతే ఏసీ గాలి తగిలేలా ఫోన్ హోల్డర్‌ను సెట్ చేసుకోండి.

సౌకర్యం కోసం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన వేల రూపాయల ఖరీదైన ఫోన్‌ను దెబ్బతీస్తాయి. ఇకపై.. మీరు కారులో ప్రయాణించేటప్పుడు ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి. మీ ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను సురక్షితంగా కాపాడుకోండి!

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×